ప్రతిష్ఠాత్మక పార్లమెంటు నూతన భవన నిర్మాణ(సెంట్రల్ విస్టా) ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై మంగళవారం తీర్పు వెలువరించనుంది సుప్రీంకోర్టు. ఈ విషయమై ఇప్పటికే అన్ని వాదనలు విన్న జస్టిస్ ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. గతేడాది నవంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది.
ప్రాజెక్టు డిజైన్, స్థలం కేటాయింపు, పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇదీ చదవండి: మోదీ 2.0: పాలన కేంద్రంగా సెంట్రల్ విస్టా
కొత్త పార్లమెంట్, ప్రభుత్వ భవనాల ఆధునికీకరణకు సంబంధించి 2019 సెప్టెంబర్‌లో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ చేపట్టింది కేంద్రం. ఇందులో 900 నుంచి 1,200 మంది పార్లమెంట్ సభ్యులు కూర్చునేందుకు వీలుగా.. త్రిభుజాకారంలో పార్లమెంట్ భవనాన్ని నిర్మించనున్నారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం(2022 ఆగస్టు 15) నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇదే ప్రాజెక్టులో ఉమ్మడి కేంద్ర సచివాలయాన్ని 2024లోపు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
2020 డిసెంబర్ 10న పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రూ. 971 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మాణం చేపట్టనున్నట్టు లోక్సభ్ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.
ఇదీ చదవండి: సెంట్రల్ విస్టాకు పర్యావరణ అనుమతులు