ETV Bharat / bharat

భార్యలను తీసుకెళ్లని ఎన్​ఆర్​ఐ భర్తలపై వ్యాజ్యం - supreme court on dowry

వరకట్నం కోసం భార్యలను వేధిస్తున్న ఎన్​ఆర్​ఐ భర్తలను అరెస్ట్​ చేయాలంటూ దాఖలైన వ్యాజ్యాలను జులైలో విచారించనున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తప్పించుకొని తిరుగుతున్న భర్తలను తిరిగి రప్పించేందుకు లుక్​అవుట్​ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్​దారులు కోరారు.

sc
భార్యలను తీసుకెళ్లని ఎన్​ఆర్​ఐ భర్తలపై వ్యాజ్యం
author img

By

Published : Mar 23, 2021, 7:52 AM IST

వరకట్నం కోసం భార్యలను వేధిస్తున్న, వారిని విడిచిపెడుతున్న ఎన్​ఆర్​ఐ భర్తలను తప్పనిసరిగా అరెస్టు చేయాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై జులై నెలలో వాదనలు ఆలకించనున్నట్టు సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఈ దావాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.ఎ.బోబ్డే, జస్టిస్​ ఎ.ఎస్​. బోపన్న, జస్టిస్​ వి.రామసుబ్రమణియన్​లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ప్రవాసీ లీగల్​ సెల్, మరికొన్ని సంస్థలు వీటిని దాఖలు చేశాయి.

తప్పించుకొని తిరుగుతున్న భర్తలను తిరిగి రప్పించేందుకు లుక్​అవుట్​ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్​దారులు కోరారు. రాయబార కార్యాలయాల ద్వారా అలాంటి వారి పాస్​పోర్టులను స్వాధీనం చేసుకోవాలని కూడా సూచించారు. కొంతమంది భారీగా కట్నాలు తీసుకొని, ఘనంగా పెళ్లి చేసుకొని ఆయా దేశాలకు వెళ్లిపోతున్నారని తెలిపారు. భార్యకు వీసా, టిక్కెట్లు పంపిస్తామని చెప్పి తరువాత ముఖం చూపడం లేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'వారికి ఉచితంగా న్యాయసేవలు అందించండి!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.