Supreme Court On Lawmakers Pending Cases : చట్టసభ సభ్యులపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించేలా అన్ని హైకోర్టులు సుమోటో కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇలాంటి కేసులను విచారించడానికి ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేయాలని చెప్పింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మినహా.. చట్టసభ్యుల కేసుల విచారణను వాయిదా వేయకూడదని ట్రయల్ కోర్టులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించేలా అన్ని ట్రయల్ కోర్టులకు ఉమ్మడి మార్గదర్శకాలను ఇవ్వడం కష్టమని పేర్కొంది.
ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతూ.. న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి.. గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. చట్టసభ్యుల క్రిమినల్ కేసుల విచారణల స్థితిగతులపై ట్రయల్ కోర్టుల నుంచి హైకోర్టులు నివేదిక కోరవచ్చని తెలిపింది. నేతల కేసుల విచారణపై పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక బెంచ్‌లకు ప్రధాన న్యాయమూర్తి లేదా సీజేఐ నియమించిన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని తెలిపింది. ఇక ప్రత్యేక కోర్టుల్లో విచారణలకు సంబంధించిన మౌలిక, సాంకేతిక సదుపాయాలు ఉండేలా జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ న్యాయమూర్తులు చూసుకోవాలని ఆదేశించింది.
ఇక ఈ తీర్పుపై పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ్ హర్షం వ్యక్తం చేశారు. 'ఈరోజు సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని, ఈ కేసులను ఏడాదిలోగా పరిష్కరించాలని సుప్రీం కోర్టు అన్ని హైకోర్టులను ఆదేశించింది' అని చెప్పారు.
-
VIDEO | "Today, the Supreme Court has given a historic verdict. The Supreme Court judgment has come with regard to our first prayer. The court has directed all the high courts to constitute a special bench to monitor cases of MPs, MLAs and ensure that these cases are decided… pic.twitter.com/WgcLerxIoR
— Press Trust of India (@PTI_News) November 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "Today, the Supreme Court has given a historic verdict. The Supreme Court judgment has come with regard to our first prayer. The court has directed all the high courts to constitute a special bench to monitor cases of MPs, MLAs and ensure that these cases are decided… pic.twitter.com/WgcLerxIoR
— Press Trust of India (@PTI_News) November 9, 2023VIDEO | "Today, the Supreme Court has given a historic verdict. The Supreme Court judgment has come with regard to our first prayer. The court has directed all the high courts to constitute a special bench to monitor cases of MPs, MLAs and ensure that these cases are decided… pic.twitter.com/WgcLerxIoR
— Press Trust of India (@PTI_News) November 9, 2023