ETV Bharat / bharat

చార్​ధామ్​ జాతీయ రహదారి ప్రాజెక్టుపై సుప్రీం కీలక నిర్ణయం - supreme court latest news

SC on Chardham road project: చార్​ధామ్​ జాతీయ రహదారి ప్రాజెక్టులో రోడ్డు విస్తరణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం విజ్ఞప్తికి అనుమతులిచ్చింది.

sc on chardham road project
చార్​ధామ్​ జాతీయ రహదార ప్రాజెక్టుపై సుప్రీం కీలక నిర్ణయం
author img

By

Published : Dec 14, 2021, 12:03 PM IST

Chardham road project update: జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని చార్​ధామ్​ జాతీయ రహదారి ప్రాజెక్టులో రోడ్డు విస్తరణకు అనుమతులిచ్చింది సుప్రీంకోర్టు. ప్రాజెక్టుపై నివేదికను రూపొందించి, దానిని నేరుగా తమకు అందించేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ ఏకే సిక్రి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీకి రక్షణశాఖ, రోడ్డు రవాణాశాఖ, ఉత్తరాఖండ్​ ప్రభుత్వం, అన్ని జిల్లాల మెజిస్ట్రేట్​లు సహకారం అందించాలని జస్టిస్​ డీవై చంద్రచూడ్​తో కూడిన సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

ఉత్తరాఖండ్​లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్​నాథ్​, బద్రీనాథ్​లను కలుపుతూ 900కిలోమీటర్ల వ్యూహాత్మక ప్రాజెక్టుకు తలపెట్టింది కేంద్రం. ఈ ప్రాజెక్టు విలువ రూ. 12వేల కోట్లు.

Chardham road project supreme court: చైనా సరిహద్దు వరకు నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టులో క్యారేజ్​ వే వెడల్పును 5.5 మీటర్లకు మార్చాలని 2018లో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల్లో మార్పులు చేయాలని కోరుతూ ఈ ఏడాది సెప్టెంబర్​లో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కేంద్రం. ఇందుకు కోర్టు అంగీకరించింది.

ఇదీ చూడండి:- చైనా సరిహద్దులకు ఆయుధాలు తరలించాలి కదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.