Supreme Court Hijab Case: విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం అంగీకరించింది. త్వరలోనే విచారణ చేపట్టాల్సిన పిటిషన్ల జాబితాలో వీటిని చేరుస్తానని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోడా ఈ అంశాన్ని ప్రస్తావించగా.. సీజేఐ ఈమేరకు స్పందించారు.
మరోవైపు.. శ్రీ రామనవమి రోజు దిల్లీలోని జహంగీర్పురీ సహా మరో ఏడు రాష్ట్రాల్లో జరిగిన అల్లర్లపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్లో ప్రభుత్వాలు బుల్డోజర్లు ఉపయోగించడంపై కూడా కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి : 4 గంటల్లో 25కి.మీ స్విమ్మింగ్.. సముద్రంలో పదేళ్ల బాలిక సాహసం