బంగాల్లో టపాసుల నిషేధంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. ప్రస్తుత పరిస్థితుల్లో బాణసంచాపై నిషేధం సరైనదేనని, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని పేర్కొంది.
"పండుగల ప్రాముఖ్యాన్ని మేం అర్థం చేసుకున్నాం. కానీ, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఏదీ ముఖ్యం కాదు. ఎలాంటి నిర్ణయమైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. కరోనా మహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరూ పరిస్థితులను మెరుగుపరిచే ఇలాంటి నిర్ణయాలకు మద్దతు తెలపాలి."
- జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
కలకత్తా హైకోర్టు తీర్పు..
బంగాల్లో కాళీ పూజ సమయంలో బాణసంచా వాడకం, అమ్మకాలపై నిషేధం విధిస్తూ కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. కరోనా నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకోవటం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించింది.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీకోర్టులో గౌతమ్ రాయ్ అనే వ్యక్తి సహా బుర్రబజార్ బాణసంచా వ్యాపారుల సంఘం పిటిషన్ దాఖలు చేశాయి.
ఇదీ చూడండి: ఆ నగరాల్లో టపాసుల నిషేధం