Supreme Court fire on delay in Vivekananda Reddy murder case trial: మాజీ మంత్రి వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు ఆలస్యం అవుతుందని.. విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారో..? సమాధానం చెప్పాలంటూ దర్యాప్తు అధికారిని న్యాయస్థానం ప్రశ్నించింది. వివేకా నందారెడ్డి హత్య కేసుకు సంబంధించి.. దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను మార్చాలని కోరుతూ, నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ ఇటీవలే సుప్రీంకోర్టు పిటీషన్ వేసింది. ఆ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన ధర్మాసనం.. సీబీఐపై ప్రశ్నల వర్షం కురిపించింది.
వివరాల్లోకి వెళ్తే.. వివేకానందా రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను మార్చాలని కోరుతూ, నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టు వేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారని.. దర్యాప్తు అధికారిని ధర్మాసనం ప్రశ్నించింది. దానికి దర్యాప్తు అధికారి స్పందిస్తూ.. వివేకా హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు, విచారణ చేస్తున్న అధికారి బాగానే పని చేస్తున్నారని కోర్టుకు తెలిపారు.
అనంతరం ఆగ్రహించిన ధర్మాసం.. ''దర్యాప్తు బాగానే జరిగేతే.. వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు ఆలస్యం అవుతుంది..?, వివేకా హత్య కేసు దర్యాప్తును ఇంకా ఎందుకు పూర్తి చేయడం లేదు..?, విచారణ త్వరగా ముగించకుంటే మరో అధికారిని ఎందుకు నియమించకూడదు..?, వేరొకరిని నియమించడంపై సీబీఐ డైరెక్టర్ తన అభిప్రాయాన్ని న్యాయస్థానాన్ని తెలపాలి. అలాగే, కేసు విచారణ పురోగతిపై, తాజా పరిస్థితిపై సీల్డ్ కవర్‌లో నివేదికను కోర్టుకు సమర్పించండి. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈనెల 27న చేపడతాం. ఆలోపు దర్యాప్తు పురోగతి వివరాలను ఒక సీల్డ్ కవర్‌లో అందించండి.'' అంటూ జస్టిస్ ఎంఆర్ షా ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తాజాగా తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. కేసు విచారణ సమయంలో తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా కోర్టు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు...అవినాష్ రెడ్డి పిటీషన్‌ను కొట్టివేస్తూ.. తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అంతేకాకుండా, ఈ కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి అనుమతిస్తూ.. విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది. విచారణ జరిగే ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని తెలియజేస్తూ.. అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
ఇవీ చదవండి