తనను అనర్హుడిగా ప్రకటిస్తూ.. లోక్‌సభ సచివాలయం జారీ చేసిన నోటిఫికేషన్‌పై లక్షద్వీప్ మాజీ ఎంపీ, ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫైజల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరపడానికి సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం అంగీకరించింది. తనపై లోక్‌సభ సచివాలయం విధించిన అనర్హతను వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఫైజల్ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఫైజల్ పిటిషన్‌ను అంగీకరించి సుప్రీంకోర్టు మంగళవారం దీనిపై విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. ఓ హత్య కేసులో ఫైజల్‌కు రెండేళ్ల శిక్ష విధించింది ట్రయల్ కోర్టు. ఈ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఫైజల్‌పై లోక్‌సభ అనర్హత వేటు వేసింది.
అయితే ఈ శిక్షపై కేరళ హైకోర్టు స్టే విధించనప్పటికీ లోక్‌సభ ఫైజల్‌పై విధించిన అనర్హత వేటును ఉపసంహరించుకోలేదు. దీంతో ఫైజల్ ప్రతిరోజు పార్లమెంట్‌కు వెళ్లినా సరే అక్కడ భద్రతా సిబ్బంది ఆయన్ను సభ లోపలికి అనుమతించేవారు కాదు. దీంతో ఫైజల్‌పై తనపై వేసిన అనర్హత వేటును వెంటనే తొలగించేలా చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అసలేంటీ ఫైజల్ కేసు?
ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్.. లక్షద్వీప్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించేవారు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర మాజీ మంత్రి అల్లుడు, కాంగ్రెస్ నాయకుడు అయిన మహ్మద్ సలీహ్‌పై ఫైజల్‌తోపాటు మరికొందరు దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఫలితంగా దీనిపై కేసు నమోదై కోర్టులో సుదీర్ఘకాలం విచారణను ఎదుర్కొన్నారు ఫైజల్.
అయితే 2023 జనవరి 10న కవరట్టి సెషన్స్ కోర్టు మహ్మద్ ఫైజల్‌ను దోషిగా తేల్చుతూ తీర్పు నిచ్చింది. దీంతో ఫైజల్‌కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది దిగువ కోర్టు. ఈ తీర్పు వెలువడిన వెంటనే.. జనవరి 13న ఫైజల్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. దోషిగా తేలిన రోజు నుంచే ఆయనపై చర్యలు అమల్లోకి వస్తాయని లోక్‌సభ తెలిపింది. అనర్హత వేటుతో ఖాళీ అయిన లక్షద్వీప్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిపేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
అయితే.. హత్యాయత్నం కేసులో దోషిగా తేల్చడాన్ని, శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ మహ్మద్ ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కేరళ హైకోర్టు ఈ ఏడాది జనవరి 25న తన తీర్పును వెల్లడించింది. ఫైజల్ తన పిటిషన్లో కోరినట్టుగా హత్యాయత్నం కేసులో ఆయన్ను దోషిగా తేల్చడాన్ని, శిక్ష విధించడాన్ని నిలుపుదల చేస్తూ స్టే విధించింది కేరళ హైకోర్టు. ఈ కోర్టు తీర్పు ఫలితంగా ఫైజల్‌పై పడిన అనర్హత వేటును లోక్‌సభ తొలగించాలి. కానీ లోక్‌సభ ఆయనపై ఉన్న అనర్హత వేటును తొలగించలేదు. దీంతో ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఫైజల్‌ను దోషిగా తేల్చడంపై స్టే ఇచ్చి, అనర్హత వేటు వర్తించదని కేరళ హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత.. కేంద్ర ఎన్నికల సంఘం లక్షద్వీప్ ఉపఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. ఫైజల్ సభ్యత్వాన్ని మాత్రం ఇంకా లోక్‌సభ పునరుద్ధరించకపోవడం గమనార్హం. దోషిగా తేలిన వెంటనే అనర్హత వేటు పడుతుందని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేస్తుంటే.. ప్రజాప్రతినిధిని దోషిగా తేల్చడంపై స్టే విధిస్తే.. అనర్హత వేటు వర్తించదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి సందిగ్ధతల నడుమ.. ఇప్పుడు రాహుల్ గాంధీ అపీల్‌కు వెళ్తే ఏం జరుగుతుందో అని సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
రాహుల్ గాంధీపై ప్రభావమెంత?
కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ అయిన రాహుల్ గాంధీపై లోక్‌సభ సచివాలయంలో అనర్హత వేటు పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకు రెండేళ్లు జైలుశిక్ష విధించింది. కోర్టు తీర్పు ఆధారంగా రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ఓ నోటీఫికేషన్ విడుదల చేసింది. తీర్పు వెలువడిన మార్చి 23నే రాహుల్ గాంధీ ఎంపీ పదవికి అనర్హుడైనట్లు ఓ ప్రకటనలో ద్వారా తెలియజేసింది.