ETV Bharat / bharat

దేవుడికి కోర్టు సమన్లు!.. హైకోర్టు ఆగ్రహం - విగ్రహానికి కోర్టు సమన్లు

Summons to God: గర్భగుడిలో ఉన్న విగ్రహానికి సమన్లు జారీ చేసింది తమిళనాడు కుంభకోణంలోని ప్రత్యేక న్యాయస్థానం. దీనిని వ్యతిరేకిస్తూ పిటిషనర్​ హైకోర్టును ఆశ్రయించగా.. కుంభకోణం కోర్టు ఆదేశాలను రద్దు చేసింది మద్రాస్​ హైకోర్టు.

high court
దేవుడికి కోర్టు సమన్లు!.. హైకోర్టు ఆగ్రహం
author img

By

Published : Jan 7, 2022, 11:01 PM IST

Summons to God: ఓ కేసు విచారణలో భాగంగా గుడిలో ప్రతిష్టించిన విగ్రహానికి సమన్లు జారీ చేసింది తమిళనాడులోని కుంభకోణం కోర్టు. న్యాయస్థానం చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాస్​ హైకోర్టు కుంభకోణం కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. విచారణకు విగ్రహాన్ని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఇదీ జరిగింది..

తిరుపూరు జిల్లా శివిరిపలయంలోని పరమశివన్​ స్వామి ఆలయంలో విగ్రహం కొన్నాళ్ల కిందట చోరీకి గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి విగ్రహాన్ని కనిపెట్టారు. కుంభకోణంలోని ప్రత్యేక న్యాయస్థానం ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఆలయ యాజమాన్యానికి అప్పగించారు. అయితే ఇటీవల గర్భగుడిలో ప్రతిష్టించిన ఈ విగ్రహాన్ని పరీక్షించేందుకు కోర్టులో హాజరుపరచాలని సంబంధిత అధికారి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై వ్యతిరేకత వ్యక్తమయినా.. అధికారి ఆదేశాలను సమర్థిస్తూ కుంభకోణం కోర్టు సమన్లు జారీ చేసింది.

ఈ ఆదేశాలను సవాల్​ చేస్తూ పిటిషనర్ మద్రాస్​​ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. కుంభకోణం కోర్టు ఆదేశాలు రద్దు చేసింది. ఆలయానికి వెళ్లి విగ్రహాన్ని పరీక్షించవచ్చని తెలిపింది. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి : 'ఆ ప్రయాణికులకు హోం క్వారంటైన్​ తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.