ETV Bharat / bharat

'కొవాగ్జిన్-కొవిషీల్డ్ కలిపితే సూపర్ ఫలితం!' - కొవాగ్జిన్ కొవిషీల్డ్ మిక్సింగ్

కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల మిక్సింగ్​పై ఐసీఎంఆర్ కీలక విషయాలు వెల్లడించింది. ఈ రెండు వ్యాక్సిన్లను కలపడం సురక్షితమేనని పేర్కొంది. ఈ మిక్సింగ్ టీకా ద్వారా మెరుగైన రోగనిరోధక స్పందనలు కలిగాయని తెలిపింది.

covaxin covishield
కొవాగ్జిన్-కొవిషీల్డ్
author img

By

Published : Aug 8, 2021, 12:23 PM IST

Updated : Aug 8, 2021, 2:08 PM IST

కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను కలపడం ద్వారా మంచి ఫలితాలు కనిపించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. అడినోవైరస్ వెక్టార్ ఆధారిత టీకాను.. వైరస్ ద్వారా తయారు చేసిన వ్యాక్సిన్​తో కలపడం సురక్షితమేనని నిర్ధరించింది ఐసీఎంఆర్. అంతేకాక.. ఈ మిక్సింగ్ టీకా ద్వారా మరింత మెరుగైన రోగనిరోధక స్పందనలు కలిగినట్లు వివరించింది.

అధ్యయనంలో భాగంగా ఉత్తర్​ప్రదేశ్​లో 98 మందిపై ప్రయోగాలు చేశారు. వలంటీర్లలో 18 మందికి తొలి డోసు కొవిషీల్డ్, రెండో డోసు కొవాగ్జిన్ అందించారు. 40 మందికి కొవిషీల్డ్, మిగిలిన 40 మందికి కొవాగ్జిన్ ఇచ్చారు. ఒకే టీకాకు చెందిన రెండు డోసులు తీసుకున్నవారికి లభించిన ఇమ్యూనిటీతో పోలిస్తే మిక్సింగ్ టీకా తీసుకున్నవారిలో మరింత మెరుగైన రోగనిరోధకత లభించిందని పరిశోధకులు గుర్తించారు.

"కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను తీసుకున్న వలంటీర్ల రోగనిరోధకతతో, మిక్సింగ్ టీకా తీసుకున్న వ్యక్తుల ఇమ్యూనిటీని పోల్చి చూశాం. మూడు గ్రూపుల్లోని వ్యక్తులకు టీకా వల్ల దుష్ప్రభావాలు తక్కువగానే ఉన్నాయి. టీకా కాంబినేషన్ సురక్షితమేనని స్పష్టమైంది. మిక్స్​డ్ టీకా తీసుకున్న వ్యక్తుల్లో ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లపై పోరాడే ఇమ్యూనిటీ.. ఒకే వ్యాక్సిన్ స్వీకరించిన వారికంటే అధికంగా ఉంది. కాబట్టి... టీకా మిక్సింగ్.. సురక్షితమే కాక ఇమ్యూనిటీ కూడా అందిస్తోందని తేలింది. మాకున్న సమాచారం మేరకు అడినోవైరస్ టీకా తర్వాత ఇనాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్​ను కలిపి ప్రయోగించిన అధ్యయనం ఇదే."

-పరిశోధకులు

అధ్యయనంలో పాల్గొన్న వారిలో టీకా తీసుకున్న 30 నిమిషాల తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని నివేదిక తెలిపింది. మిక్సింగ్ టీకా తీసుకున్న బృందం సగటు వయసు 62 ఏళ్లుగా ఉన్నప్పటికీ.. మెరుగైన ఫలితాలు వచ్చాయని అధ్యయనం పేర్కొంది. ఈ ఫలితాలపై నిర్ధరణకు వచ్చేందుకు మరిన్ని సెంటర్లలో క్లినికల్ ట్రయల్స్ జరగాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఇదీ చదవండి: 'ఆ రెండు టీకాలు కలిపి ఇస్తే కరోనా నుంచి రక్ష!'

Last Updated : Aug 8, 2021, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.