హెచ్ఐవీ పాజిటివ్ అనే కారణంతో చిన్న పిల్లలను బడి నుంచి బహిష్కరించిన ఘటన మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని ఓ జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగింది. ఉపాధ్యాయులే కావాలని పిల్లలను పంపించేశారని ఇన్ఫాంట్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దత్తా బెనర్జీ ఆరోపించారు. ఈ ఘటనపై సంబంధిత మంత్రికి ఫిర్యాదు చేశారు. హెచ్ఐవీపై అవగాహన కోసం ప్రభుత్వాలు కొన్ని కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నా.. ఇటువంటి సామూహిక బహిష్కరణలు జరగడాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు బెనర్జీ.
అయితే బెనర్జీ ఆరోపణలను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోసిపుచ్చారు. తాము ఎవరినీ బడి నుంచి బహిష్కరించలేదని చెప్పారు. బెనర్జీ పేర్కొన్న విద్యార్థులు తమ పాఠశాలలో చేరలేదని స్పష్టం చేశారు.
ఇన్ఫాంట్ ఇండియా సంస్థకు చెందిన విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి చదివేవారు తమ బడిలో చేరారని... అయితే వారిపైనా తాము ఎటువంటి వివక్ష చూపలేదని ప్రధానోపాధ్యాయుడు కేఎస్ లాడ్ అన్నారు.
ఇదీ చూడండి: కాశీలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక శౌచాలయాలు