ETV Bharat / bharat

విద్యార్థినిపై హత్యాచారం..​ రూమ్​లో నగ్నంగా మృతదేహం.. సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య

author img

By

Published : Jun 7, 2023, 2:30 PM IST

హాస్టల్​లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఓ విద్యార్థిని. తాళం వేసి ఉన్న ఓ రూంలో నగ్నంగా ఆమె మృతదేహం పడి ఉంది. మరోవైపు అదే హాస్టల్​ పనిచేసే ఓ ఉద్యోగి కూడా.. రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది.

student-died-in-hostel-dead-body-of-student-naked-in-hostel-room-maharashtra
హాస్టల్‌లో 19 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద మృతి

మహారాష్ట్ర ముంబయిలోని ఓ గర్ల్స్​ హాస్టల్​లో 19 ఏళ్ల విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. హాస్టల్ గదిలో నగ్నంగా పడి ఉన్న ఆ యువతి మెడ చుట్టూ.. దుపట్టా చుట్టి ఉంది. రూం బయట నుంచి తాళం వేసి ఉంది. అయితే, యువతి హత్య తరువాత.. ఇదే హాస్టల్​లో పనిచేసే ఓ ఉద్యోగి సైతం రైలు కింద పడి మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సావిత్రి భాయ్​ పూలే గర్ల్స్​ హాస్టల్​లో ఈ ఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. శవపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థినిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతి గదిలోంచి ఆధారాలను సైతం ఫోరెన్సిక్ టీం సేకరించిందని వారు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. అదే హాస్టల్​లో పనిచేసే ఓం ప్రకాష్ కానోజియా ​అనే ఉద్యోగి సైతం మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. అనంతరం ఆయన కోసం గాలించగా.. చార్ని రోడ్ రైల్వే స్టేషన్​ సమీపంలోని పట్టాలపై శవమై కనిపించాడు. యువతి హత్య కేసులో ఓం ప్రకాష్ కానోజియా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే రైలు కింద పడి చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్​మార్టం పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఓం ప్రకాష్​ను ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై ఎన్​సీపీ ఎంపీ సుప్రియా సూలే.. ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మహిళ భద్రత విషయంలో విఫలం చెందాయని దుయ్యబట్టారు. హాస్టల్​లో సీసీ కెమెరాలు, అలారం బెల్స్​ అమర్చాలని ఆమె సూచించారు. హెల్ప్​లైన్​ నంబర్స్​ కూడా ఏర్పాటు చేయాలన్నారు.

డబ్బా​లో చిన్నారుల మృతదేహాలు..
ఓ చెక్క పెట్టెలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమైన ఘటన దిల్లీలో జరిగింది. మృతులను నీరజ్​ (8), ఆర్తి(6)గా పోలీసులు గుర్తించారు. జామియా నగర్​లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారుల తండ్రి బల్బీర్. స్థానికంగా సెక్యూరిటీ గార్డ్​గా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన చిన్నారులు.. దాదాపు 3.30 గంటల సమయంలో కనిపించకుండా పోయారు. దీంతో వారి కోసం తీవ్రంగా గాలించారు తల్లిదండ్రులు. అనంతరం ఓ చెక్క బాక్స్​లో మృతదేహాలను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులు ఊపిరాడకపోవడం వల్లే చనిపోయారని వారు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.