ETV Bharat / bharat

'మా వర్గం అమ్మాయితో మాట్లాడతావా?'.. యువకుడ్ని చితకబాదిన క్లాస్​మేట్స్​ - కూతురిపై తండ్రి అత్యాచారం

Student Beaten By Classmates : కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో తమ వర్గానికి చెందిన అమ్మాయితో మాట్లాడుతున్నాడని ఓ విద్యార్థిని చితకబాదారు. మరో ఘటనలో తన ఇంటి ముందు ఫోన్​ మాట్లాడుతున్నాడని తుపాకీతో కాల్చాడు ఓ ఇంటి యజమాని. ఈ ఘటన దిల్లీలోని గాజియాబాద్​లో జరిగింది.

Student Beaten By Classmates
Student Beaten By Classmates
author img

By

Published : Aug 31, 2022, 5:02 PM IST

Student Beaten By Classmates : కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో ఓ విద్యార్థిని చితకబాదారు తోటి విద్యార్థులు. తమ వర్గానికి చెందిన విద్యార్థినితో మాట్లాడుతున్నాడని దారుణంగా కొట్టారు. జిల్లాలోని సుళ్యా తాలుకాలోని ఓ కళాశాలలో మంగళవారం జరిగిందీ ఘటన. బాధితుడు సుళ్యా తాలుకాలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న మరో వర్గానికి చెందిన విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమెతో తరచూ మాట్లాడేవాడు.

దీనిని గమనించిన అమ్మాయి వర్గానికి చెందిన విద్యార్థులు ఆగ్రహానికి గురయ్యారు. మాట్లాడతామంటూ బాధితుడిని కళాశాల మైదానానికి పిలిపించారు. అతడు రాగానే.. కర్రలతో కొట్టడం మొదలుపెట్టారు. తమ వర్గానికి చెందిన విద్యార్థితో మాట్లాడితే చంపేస్తామంటూ బెదిరించారు. గాయాలపాలైన బాధితుడు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు చెప్పాడు. అనంతరం అతడ్ని సుళ్యా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించిన తల్లిదండ్రులు.. ఏడుగురు విద్యార్థులపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇంటి ముందు ఫోన్​ మాట్లాడుతున్నాడని యువకుడిని కాల్చిన యజమాని: తన ఇంటి ముందు ఫోన్​ మాట్లాడుతున్నాడని ఓ యువకుడిపై కాల్పులు జరిపాడు మరో యువకుడు. ఈ ఘటన దిల్లీలోని గాజియాబాద్​లో జరిగింది. సిహాని గేట్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని ఓ యువకుడు బైక్​పై వెళ్తుండగా ఫోన్​ వచ్చింది. దీంతో రోడ్డు పక్కన నిలిపి మాట్లాడుతున్నాడు. అతడిని గమనించిన ఇంటి యజమాని.. తన ఇంటి ముందు కాకుండా ముందుకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించాడు. తాను చెప్పినా వినకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహించిన నిందితుడు.. తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. బుల్లెట్​ యువకుడి భుజానికి తగలడం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగింది. అనంతరం బాధితుడిని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

మూడు నెలల కింద రేప్​.. మైనర్​కు గర్భం​: ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు పక్కింటి వ్యక్తి. బాలికపై గతంలో అత్యాచారానికి పాల్పడగా.. తాజాగా గర్భం దాల్చడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దిల్లీలోని నారాయణ గ్రామంలో జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మూడు నెలల క్రితం బాధితురాలి తల్లిదండ్రులు తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన పక్కింటి వ్యక్తి.. లోపలకు బలవంతంగా ప్రవేశించి మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీన్నంతా వీడియో తీసి.. ఎవరికైనా చెపితే చంపేస్తానంటూ బెదిరించాడు. నిందితుడి బెదిరింపులకు భయపడిన బాలిక ఎవరికీ చెప్పలేదు. అయితే, ఆదివారం అర్ధరాత్రి బాధితురాలికి ఒక్కసారిగా కడుపులో నొప్పి మొదలైంది. అప్రమత్తమైన బాధితురాలి తల్లిదండ్రులు.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. బాలిక గర్భం దాల్చినట్లు ధ్రువీకరించారు. ఆమెను ప్రశ్నించగా జరిగిన విషయన్నంతా బయటపెట్టింది.

సొంత కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం: హరియాణా అంబాలాలో దారుణం జరిగింది. సొంత కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంబాలా కంటోన్మెంట్​ ప్రాంతానికి చెందిన ఓ మైనర్..​ తన తండ్రి గత ఏడేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదట బంధువుల ఇంట్లో అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఆ తర్వాత తరచూ లైంగిక వేధింపులకు గురి చేసేవాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం బయట చెపితే తన తల్లితో సహా ఇద్దరిని సజీవ దహనం చేస్తానని బెదిరించినట్లు చెప్పింది. తాజాగా బంధువుల సహాయంతో పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది బాలిక. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: తోపుడుబండిపై గర్భిణీ.. కష్టపడి ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్, నర్స్ ఆబ్సెంట్

పెళ్లి సమయంలో వరుడు పరార్​.. వెనకే పరిగెత్తిన వధువు.. చివరకు పోలీసుల జోక్యంతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.