తనకు కూతురు పుట్టిందన్న సంతోషాన్ని ప్రజలతో పంచుకున్నాడు మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన ఓ పానీపూరీ వ్యాపారి. ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే ఉన్నా.. రూ. 40 వేలు ఖర్చు చేసి.. స్థానికులకు ఉచితంగా పానీపూరీ పంపిణీ చేశాడు. తనకు కూతురు పుట్టాలని ఎప్పటినుంచో దేవుడిని ప్రార్థిస్తున్నానని.. ఇప్పటికి తన కల నేరవేరిందన్నాడు అంచల్ గుప్తా.

తనకు కుమార్తె పుట్టిన సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదని గుప్తా చెప్పుకొచ్చాడు. అంతేకాక అబ్బాయిలూ, అమ్మాయిలూ సమానమేనన్న సందేశాన్ని ఇస్తున్నాడు.

" కుమార్తె జననంతో నా కల నెరవేరింది. నాకు పెళ్లైనప్పటినుంచి ఆడబిడ్డ కావాలని కోరుకున్నా. తొలి సంతానంలో మగబిడ్డ పుట్టాడు. రెండేళ్ల తర్వాత ఆగస్టు 17న కుమార్తె పుట్టింది. కుమార్తెలతోనే భవిష్యత్ ఉంది." అని అంచల్ గుప్తా పేర్కొన్నాడు.

8వ తరగతి వరకు చదువుకున్న గుప్తా.. ప్రస్తుతం భోపాల్‌లోని కోలార్ ప్రాంతంలో 20 ఏళ్లుగా పానీపూరీ బండి నడుపుతున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గుప్తా భార్య.. ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తోంది.
ఇదీ చదవండి: ఫోన్ కోసం అక్కాతమ్ముళ్ల గొడవ- చూస్తుండగానే విషం తాగి...