ETV Bharat / bharat

ప్రధాని ఎవరో చెప్పలేకపోయాడని పెళ్లి రద్దు​.. అక్కడికక్కడే వరుడి తమ్ముడితో ఆమెకు మరో వివాహం - వరుడు ప్రధాని పేరు చెప్పనందుకు వివాహం క్యాన్సిల్

Strange Wedding In UP : ఉత్తర్​ప్రదేశ్​లోని ఘాజీపుర్​ జిల్లాలో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. జరిగిన పెళ్లిని కాదని.. పెళ్లికొడుకు తమ్ముడిని వివాహం చేసుకుంది ఓ యువతి. వరుడు.. దేశ ప్రధాని పేరు చెప్పలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది.

strange-wedding-bride-married-to-groom-younger-brother-in-uttar-pradesh
పెళ్లి కొడుకు ప్రధాని పేరు చెప్పలేదని వివాహం క్యాన్సిల్
author img

By

Published : Jun 20, 2023, 6:42 PM IST

Updated : Jun 21, 2023, 6:21 AM IST

Strange Wedding In UP : వరుడు.. దేశ ప్రధాన మంత్రి పేరు చెప్పలేదని జరిగిన పెళ్లిని రద్దు చేసుకుని.. అక్కడికక్కడే పెళ్లికొడుకు తమ్ముడిని వివాహం చేసుకుంది ఓ యువతి. వరుడిని చూసి వధువు తరఫు బంధువులు హేళన చేశారనే కారణంతో ఆ యువతి ఇలా చేసింది. ఉత్తర్​ప్రదేశ్​లోని ఘాజీపుర్​ జిల్లాలో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది.

27 ఏళ్ల శివ శంకర్​కు జూన్​ 11న రంజన అనే యువతితో వివాహం జరిగింది. శివ శంకర్​ సైద్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నసీర్‌పుర్ గ్రామానికి చెందిన వ్యక్తి. కాగా కరంద పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంత్ పట్టి గ్రామానికి చెందిన యువతి రంజన. ఆరు నెలల క్రితం వీరిద్దరి వివాహం నిశ్చయమైంది.
వివాహం జరిగిన రోజు సాయంత్రమే ఊరేగింపుగా వధువు ఇంటికి వెళ్లాడు వరుడు. అనంతరం జూన్​ 12న ఉదయం.. పెళ్లి వేడుకలో భాగంగా వధువు ఇంట్లో ఓ చిన్న కార్యక్రమం జరిగింది. అదే సమయంలో శివ శంకర్ మరదలు, బామర్ది అతడితో మాట్లాడుతూ.. జోకులు వేస్తున్నారు. అప్పుడే దేశ ప్రధాని ఎవరని శివశంకర్​ను అడిగింది అతని మరదలు. ఆ ప్రశ్నకు శివ శంకర్​ సమాధానం చెప్పలేకపోయాడు.

ఇది చూసిన వధువు బంధువులు.. శివ శంకర్​ను తెలివిలేని వాడని హేళన చేశారు. దీంతో అవమానానికి గురైన వధువు.. శివ శంకర్​ తమ్ముడైన అనంత్​ను అక్కడికక్కడే మరో పెళ్లి చేసుకుంది. రంజని కంటే అనంత్​ వయస్సులో చిన్నవాడు కావడం గమనార్హం. అనంతరం అదే రోజు రంజనతో కలిసి తన ఇంటికి వెళ్ళాడు అనంత్​. అదే కాగా తమను భయపెట్టి తన చిన్నకొడుకు అనంత్​తో భలవంతంగా వివాహం జరిపించారని.. శివ శంకర్ తండ్రి రామ్ ఆరోపిస్తున్నాడు. జూన్​ 13న వధువు తరపు వారు అకస్మాత్తుగా తన ఇంటికి వచ్చి.. గొడవపెట్టుకున్నారని ఆయన వెల్లడించాడు. జూన్​ 17న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

పెళ్లి కోసం 4 గంటల పెరోల్​.. వివాహం చేసుకుని మళ్లీ జైలుకెళ్లిన వరుడు..
కొద్ది రోజుల క్రితం బిహార్​లోనూ ఓ వింత వివాహం జరిగింది. పెళ్లి కోసం నాలుగు గంటల పాటు పెరోల్​పై విడుదయ్యాడు ఓ యువకుడు. అత్యాచారం కేసులో జైలులో ఉన్న ఆ యువకుడు.. బయటకు వచ్చి బాధితురాలినే పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగింది. అత్యాచారం కేసులో జైలుకెళ్లిన ఆ యువకుడు.. బాధితురాలితో కలిసి పెళ్లిపీటలెక్కాడు. అప్పట్లో ఆ పెళ్లి చుట్టుపక్క ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్ చేయండి.

మరుగుజ్జుల 'మళ్లీ పెళ్లి'.. వాటికోసమే రెండోసారి వివాహం..
వారిద్దరూ మరుగుజ్జులు. కొంత కాలం క్రితమే ఓ గుడిలో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా రెండోసారి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం రిజిస్టర్​ ఆఫీస్​లో చట్టపరంగా ఒక్కటయ్యారు. కేంద్ర ప్రభుత్వ సాయం కోసమే.. మరోసారి పెళ్లి చేసుకున్నట్లు ఆ దంపతులు తెలిపారు. బిహార్​లోని సీతామడి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్​ చేయండి.

Last Updated : Jun 21, 2023, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.