ETV Bharat / bharat

రెండో భార్యతో కలిసి కన్నపిల్లలపై కర్కశత్వం! - Maharashtra crime news

సొంత బిడ్డలనే విచక్షణ రహితంగా చితకబాదాడు ఓ కర్కశ తండ్రి. రెండో భార్యతో కలిసి ఇద్దరు పిల్లల్ని చిత్రహింసలకు గురిచేశాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. సామాజిక మాధ్యమాల్లో సంచలనం రేపుతోంది.

Step Mother and father beat children - Incident at Igatpuri in Nashik in Maharashtra
పినతల్లితో కలిసి.. కన్నపిల్లల్నే చితకబాదిన తండ్రి!
author img

By

Published : Jan 17, 2021, 8:05 PM IST

మహారాష్ట్రలోని నాశిక్​లో ఓ రైల్వే పోలీసు అధికారి.. సొంత పిల్లలపైనే అమానుషత్వం ప్రదర్శించాడు. రెండో భార్యతో కలిసి.. తన కుమారుడు హిమాన్షు మోరె(పదేళ్లు), కుమార్తె ప్రియాన్షు మోరె(ఐదారేళ్లు)లను చితకబాదాడు. ఈ ఘటనలో ఆ చిన్నారులిద్దరి శరీరం ఎర్రగా కందిపోయింది. మొహంతో పాటు ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

Step Mother and father beat children - Incident at Igatpuri in Nashik in Maharashtra
గాయాలతో చిన్నారులు

రాహుల్​ మోరె, తండ్రి

ఇదీ జరిగింది..

రైల్వే విభాగంలో పోలీసు సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తున్నాడు రాహుల్​ మోరె. తన మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా.. ఇద్దరు పిల్లల బాగోగుల్ని చూసుకునేందుకు మరో పెళ్లి చేసుకున్నాడు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో.. ఆ పిల్లలపై ఆగ్రహం పెంచుకుందా పినతల్లి. ఆమె చెప్పుడు మాటలు విన్న రాహుల్​.. అమాయకమైన ఆ చిన్నారులపై ప్రతాపాన్ని చూపించాడు. ఇద్దరూ కలిసి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ నెల 15న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలిసిన పిల్లల మామయ్య నీలేశ్​ తడ్కర్​.. తక్షణమే చిన్నారులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స ఇప్పించారు. రాహుల్​, అతడి భార్యపై​ స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: 'రైతుల ఆదాయం రెట్టింపు చేయటమే ప్రభుత్వ లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.