మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాల్చుతున్న వేళ.. మరోసారి లాక్‌డౌన్ బాటపట్టింది ఠాక్రే సర్కార్. గురువారం రాత్రి 8 గంటల నుంచి మే 1 వరకు ఆ రాష్ట్రంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న తరుణంలో ఇప్పటికే మహారాష్ట్ర రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తోంది. అయినప్పటికీ తీవ్రత తగ్గకపోవడం వల్ల.. పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: కేంద్ర మంత్రి సహా కాంగ్రెస్ కీలక నేతలకు కరోనా