ETV Bharat / bharat

vaccine stampede: టీకా కోసం ఎగబడ్డ జనం- తొక్కిసలాట - corona

ఓ వ్యాక్సిన్ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో (vaccine stampede) 25 మందికి పైగా గాయపడ్డారు. టీకాల కొరత ఉందన్న వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా ఎగబడ్డారు ప్రజలు. ఈ ఘటన బంగాల్​లో జరిగింది.

vaccine stampede
బంగాల్
author img

By

Published : Aug 31, 2021, 9:26 PM IST

బంగాల్​లో టీకా కోసం ఎగబడ్డ జనం-25 మందికి పైగా గాయాలు

బంగాల్​లోని ఓ వ్యాక్సిన్​ కేంద్రంలో తీవ్ర తోపులాట (vaccine stampede) జరిగింది. ఈ ఘటనలో 25 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

ఒక్కసారిగా ఎగబడి..

"జల్పాయిగుడీలోని ధూప్​గుడీ ఆరోగ్య కేంద్రానికి టీకాల కోసం వందలాది జనం తరలివచ్చారు. కొవిడ్​ నిబంధనలు పాటించకుండా గేటు వద్దనే గుమిగూడారు. వారిని అదుపుచేసేందుకు అప్పటికే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో గేటు తెరవగానే ఒక్కసారిగా తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది," అని అధికారులు తెలిపారు.

vaccine stampede
టీకా కోసం ఎగబడుతున్న జనం

ఈ ఘటనలో మహిళలు కూడా గాయపడ్డారని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ తొక్కిసలాట కారణంగా.. ఆ కేంద్రంలో టీకా పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది.

ఇదీ చూడండి: కరోనా కొత్త వేరియంట్- అన్నింటికంటే డేంజర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.