ETV Bharat / bharat

స్టాలిన్​ శకం: 25ఏళ్ల తర్వాత డీఎంకే ఇలా..

author img

By

Published : May 7, 2021, 9:33 AM IST

స్టాలిన్​.. సమకాలీన ద్రవిడ రాజకీయాల్లో ఓ సంచలనం. తండ్రి మరణం తర్వాత డీఎంకేకు వేగు చుక్కగా మారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టిన నాయకుడు. అంతేకాదు 25ఏళ్ల తర్వాత పార్టీకి స్వతంత్రంగా పూర్తిస్థాయి మెజారిటీని అందించి.. తమిళనాట నవోదయానికి నాంది పలికారు. వారసత్వ పరంపరలో ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడి(కరుణానిధి) కుమారుడు సీఎంగా ఎంపికై.. స్టాలిన్​ సరికొత్త రికార్డు సృష్టించారు.

Stalin creates history as DMK gets independent majority in state elections
స్టాలిన్ శకం: 25ఏళ్ల తర్వాత డీఎంకేకు ఫుల్ మెజారిటీ

తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్టాలిన్​.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ దఫా ఎన్నికల్లో స్టాలిన్​ 'మంత్రం' వల్ల డీఎంకే సాధించిన మరో చరిత్ర సర్వత్రా చర్చనీయాంశమైంది. దాదాపు 25ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ స్వతంత్రంగా మెజారిటీ సాధించింది.

మొత్తం 234 సీట్లకు ఏప్రిల్​ 6న ఎన్నికలు జరగ్గా.. ఈ నెల 2న ఫలితాలు వెలువడ్డాయి. మ్యాజిక్​ ఫిగర్​ 118 కాగా.. ఈసారి డీఎంకే 133 స్థానాలు కైవసం చేసుకుంది. అంటే మెజారిటీ కన్నా 15 సీట్లు ఎక్కువ. మొత్తం మీద.. డీఎంకే కూటమి 159 స్థానాల్లో గెలుపొందింది.
1996 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 173 సీట్లతో స్వతంత్రంగా మెజారిటీని అందుకున్న డీఎంకే.. ఈ విషయంలో 2021 ముందు వరకు డీలా పడింది.

200 మార్క్​ మిస్​...

1971లో జరిగిన ఎన్నికల్లో 184 సీట్లను వెనకేసుకుంది డీఎంకే. సీట్ల పరంగా.. ఆ పార్టీకి ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రికార్డు. ఈ దఫా ఎన్నికల్లో ఆ రికార్డును తిరగరాస్తామని, 200కుపైగా శాసనసభ స్థానాల్లో గెలుస్తామని స్టాలిన్​ ధీమా వ్యక్తం చేశారు. అనేక ఎగ్జిట్​ పోల్స్​ కూడా ఇంచుమించు ఇవే గణాంకాలను చూపించాయి కూడా! కానీ ఎన్నికల ఫలితాల్లో పరిస్థితి భిన్నంగా కనిపించింది. డీఎంకేకు 133 సీట్లు దక్కాయి.

stalin-creates-history-as-dmk-gets-independent-majority-in-state-elections
స్టాలిన్​ మంత్రం

ఇదీ చూడండి:- డీఎంకే సక్సెస్​ మంత్ర.. 'స్టాలిన్​'!

స్టాలిన్​ ఫస్ట్​...

తమిళనాడులో ఓ మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా సీఎం పీఠాన్ని అధిరోహిస్తున్న తొలి వ్యక్తి స్టాలిన్​ కావడం విశేషం. తండ్రి కరుణానిధి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రానికి సేవ చేస్తానని ఇప్పటికే హామీనిచ్చారు 68ఏళ్ల స్టాలిన్​.

క్లీన్​ స్వీప్​ చేయలేకపోయినప్పటికీ.. డీఎంకేకు 2021 ఎన్నికలు గుర్తుండిపోతాయి. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడమే కాకుండా.. ఈ ఎన్నికల్లో ఆ పార్టీలోని అనేక మంది కీలక నేతలు అద్భుతమైన ప్రదర్శన చేశారు. భారీ మెజారిటీలతో ప్రత్యర్థులను ఓడించి ఘన విజయాలను అందుకున్నారు.

జిల్లా కార్యదర్శి ఈవీ వేలు.. తిరువన్నామలై నుంచి 80వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. థంగం థెన్నరసు( థిరుచులి- 6 1,000కుపైగా ఓట్ల మెజారిటీ), ఉదయనిధి స్టాలిన్​(ట్రిప్లికేన్​ చెపాక్​- 60వేల ఓట్ల మెజారిటీ), డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పెరియసామి(అట్టూర్​- 55వేల ఓట్ల మెజారిటీ) అద్భుత విజయాలను దక్కించుకున్నారు.

ఇదీ చూడండి:- స్టాలిన్​ గెలిచారని నాలుక కోసుకున్న మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.