ETV Bharat / bharat

ఆ ఘనత సాధించిన తొలి సీఎం ఆయనే.. - ఎంకే స్టాలిన్ తాజా వార్తలు

తమిళనాడులో గ్రామసభ కార్యక్రమానికి హాజరైన మొట్టమొదటి సీఎంగా ఎంకే స్టాలిన్​ నిలిచారు. అక్టోబరు 2, గాంధీ జయంతి సందర్భంగా ఆయన మధురైలోని ఓ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు.

Stalin
Stalin
author img

By

Published : Oct 3, 2021, 6:47 AM IST

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అరుదైన ఘనత సాధించారు. రాష్ట్రంలో గ్రామసభకు హాజరైన తొలి ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలిచారు. అక్టోబరు 2, గాంధీ జయంతి సందర్భంగా మధురైలోని పప్పప్పట్టి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. గ్రామ కమిటీ తీర్మానించిన అంశాలపై చర్చించారు.

" దేశాభివృద్ధి గ్రామాల అభివృద్ధితో ముడిపడి ఉంది. స్థానిక సంస్థలు ఎప్పుడూ దృఢంగా ఉండాలి. ఈ గ్రామంతో నాకు చాలా అనుబంధం ఉంది. చాలా ఏళ్లపాటు పప్పప్పట్టి, కీరిపట్టి, నట్టేరుమంగళమ్​, కొట్టాకచియెండల్ గ్రామలకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. మా నాన్న సీఎంగా ఉన్నసమయంలో ఈ గ్రామాలకు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం. ఆ సమయంలో నేను పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నాను."

-- ఎంకే స్టాలిన్​, తమిళనాడు ముఖ్యమంత్రి

ఆ నాలుగు గ్రామలకు దాదాపు 10 ఏళ్లకు పైగా పంచాయతీ ఎన్నికలు జరగలేదు. 2006లో డీఎంకే ప్రభుత్వం ఆయా గ్రామాలకు స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించింది.

Stalin
గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్న ఎంకే స్టాలిన్

ఇదీ చదవండి: Veerapandi Raja: పుట్టిన రోజు నాడే మాజీ ఎమ్మెల్యే మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.