బంగాల్ శాసనసభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం 31 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 205 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
హూగ్లీ జిల్లాలోని 8 నియోజకవర్గాలకు, హావ్‌డా జిల్లాలోని 7 నియోజకవర్గాలకు, దక్షిణ పరగణాల జిల్లాలోని 16 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 205 మంది అభ్యర్థుల్లో 13 మంది మహిళా అభ్యర్థులు(6%) మాత్రమే ఉండటం గమనార్హం.
బంగాల్ దంగల్ 2021 మూడో దశ
- శాసన సభ స్థానాలు: 31
- మొత్తం అభ్యర్థులు: 205
- ఓటర్లు: 78.5 లక్షలు
- పోలింగ్ కేంద్రాలు: 10,871
ప్రముఖుల పోరు..
భాజపా తరఫున కీలక నేత స్వపన్ దాస్ గుప్త బంగాల్ మూడో దశ పోలింగ్‌లో తారకేశ్వర్ నియోజకవర్గం నంచి బరిలో ఉన్నారు. టీఎంసీ అభ్యర్థి రామేందు సింగ రాయ్, సీపీఎం అభ్యర్థి సూరజిత్ ఘోష్‌తో ఆయన తలపడుతున్నారు.
హావ్‌డా జిల్లా శ్యామ్పుర్ నుంచి నటి తను శ్రీ.. టీఎంసీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాలిపాద మండల్, కాంగ్రెస్ అభ్యర్థి అమితాభా చక్రవర్తితో పోటీ పడుతున్నారు.
618 కంపెనీల కేంద్ర బలగాలు..
మూడో దశ ఎన్నికలు జరుగుతున్న దక్షిణ 24 పరగణాలు, హావ్‌డా, హూగ్లీ జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. 10,871 పోలింగ్ కేంద్రాల వద్ద 618 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఓటర్లు కొవిడ్-19 నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇవీ చూడండి: