Central Government Jobs : ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ (జేఈ) ఉద్యోగాల భార్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ). మొత్తం 1324 ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఈనెల 26 నుంచి స్వీకరిస్తోంది. ఆసక్తి కలిగి, అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు..
SSC JE Total Posts 2023 : 1324 పోస్టులు.
పోస్టు..
SSC JE Posts : గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్ పోస్టులు.
విద్యార్హతలు..
SSC JE Education Qualification : డిప్లొమా (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) చదివినవారు అర్హులు. కొన్ని పోస్టులకు పని అనుభవం కూడా తప్పనిసరిగా చేర్చారు.
జీతం:
SSC JE Posts Salary : ఏడో వేతన స్కేలు ప్రకారం రూ.35,400-రూ.1,12,400 వరకు జీతభత్యాలు ఉంటాయి.
వయో పరిమితి:
SSC JE Age Limit : పోస్టులను బట్టి కొన్ని పోస్టులకు 30 ఏళ్లు, మరికొన్నింటికి 32 ఏళ్లు వయో పరిమితిని విధించారు. వివిధ కేటగిరీలవారికి వయోపరిమితుల్లో సడలింపులు ఉన్నాయి. కొన్ని కేటగిరీలవారికి మినహాయింపులు కూడా ఉన్నాయి.
అప్లికేషన్ ఫీజు:
- SSC JE Application Fee : దరఖాస్తు రుసుము- రూ.100/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. పూర్తిగా ఉచితం.
దరఖాస్తు చివరితేదీ..
SSC JE Application Last Date : 2023 ఆగస్టు 16.
ఎంపిక విధానం:
SSC JE Selection Process : పేపర్-1, పేపర్-2 రాత పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు. అనంతరం వైద్య పరీక్షల నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జాబ్ లొకేషన్..
SSC JE Job Location : ఈ పోస్టులకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేదా శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్‌గా పనిచేయాల్సి ఉంటుంది.
ఏవైనా పొరపాట్లు ఉంటే..
SSC Recruitment 2023 : అభ్యర్థుల దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సవరించుకునేందుకు ఆగస్టు 17, 18 తేదీల వరకు గడువు ఉంది.
పరీక్ష విధానం..
SSC JE Exam Mode : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-1)
పరీక్ష నిర్వహణ..
SSC JE Exam Date : అక్టోబర్‌లో పరీక్ష జరిగే అవకాశం ఉంది.
పరీక్ష కేంద్రాలు..
SSC JE Exam Center List : హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, చీరాల, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి.
- ఇవీ చదవండి :
- UPSC Jobs 2023 : గవర్న్మెంట్ జాబ్ నోటిఫికేషన్.. లక్షల్లో జీతం.. అప్లై చేసుకోండిలా!
- Health Assistant Posts Notification : 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- Engineering Jobs : ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 553 ఎగ్జామినర్ పోస్టులకు నోటిఫికేషన్!
- IBPS Jobs : క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు.. 5 రోజులే ఛాన్స్.. పెరిగిన 500 పోస్టులు!