SSC Hindi Translator Jobs : హిందీ ప్రధానాంశంగా చదివి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 307 ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ( SSC Recruitment 2023 )
ఉద్యోగాల వివరాలు
SSC Hindi Translator Posts :
- జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ - 10 పోస్టులు
- సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ - 10 పోస్టులు
- జూనియర్ ట్రాన్స్‌లేటర్ - 287 పోస్టులు
విద్యార్హతలు
SSC Hindi Translator Eligibility :
- జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ : అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లీష్ పాఠ్యాంశంగా చదివి ఉండాలి. అలాగే హిందీ నుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయడంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ క్వాలిఫై అయ్యుండాలి. లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలో రెండేళ్ల అనువాద అనుభవం ఉండాలి.
- జూనియర్ ట్రాన్స్‌లేటర్ : అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. హిందీ నుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయడంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ క్వాలిఫై అయ్యుండాలి. లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలో మూడు ఏళ్ల అనువాద అనుభవం ఉండాలి.
- సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ : అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లీష్ చదివి ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో సీనియర్ సెకెండరీ స్థాయిలో రెండేళ్ల హిందీ బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి
SSC Hindi Translator Age Limit : అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము"
SSC Hindi Translator Application Fee : జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్లకు మాత్రం దరఖాస్తు రుసుము నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.
ఎంపిక ప్రక్రియ
SSC Hindi Translator Selection Process : అభ్యర్థులకు టైర్ - 1, టైర్ - 2 రాతపరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. వీటిలో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
SSC Hindi Translator Salary :
- జూనియర్ ట్రాన్స్‌లేటర్ - రూ.35,400 - రూ.1,12,400
- జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ - రూ.35,400 - రూ.1,12,400
- సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ - రూ.44,900 - రూ.1,42,400
ముఖ్యమైన తేదీలు
SSC Hindi Translator Important Dates :
- ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్ 12
- అప్లికేషన్ కరెక్షన్ ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్ 13, 14
- పరీక్ష తేదీ : 2023 అక్టోబర్ 16
నోట్ : ఎస్ఎస్సీ హిందీ ట్రాన్స్‌లేటర్ జాబ్స్ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి.
- SSC Police Constable Jobs : ఎస్ఎస్సీ భారీ నోటిఫికేషన్.. 7547 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ.. అప్లై చేసుకోండిలా!
- SBI PO Recruitment : ఎస్బీఐ భారీ నోటిఫికేషన్.. 2000 పీవో పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?
- AIATSL Job News Today : పదో తరగతి అర్హతతో.. 998 హ్యాండీమ్యాన్, ఏజెంట్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!