ETV Bharat / bharat

ఝార్ఖండ్​లో హైదరాబాద్​ యువకుడి ఆదర్శ సాగు - శ్రీనివాసన్​ రాజు

ఝార్ఖండ్​ రాణిగా పేరుగాంచిన నేతర్​హాట్​ ప్రాంతానికి కొత్త గుర్తింపును తీసుకొచ్చారు హైదరాబాద్​కు చెందిన శ్రీనివాసన్​ రాజు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ స్ట్రాబెర్రీల సాగులో దూసుకెళుతున్నారు. తనతోపాటు తోటి వారికి మెలకువలు నేర్పిస్తూ వారిని వాణిజ్య పంటల సాగులో లాభాల బాటలో నడిపిస్తున్నారు.

SRINIVASAN RAJU
స్ట్రాబెర్రీల సాగులో ఆదర్శంగా హైదరాబాద్​ యువకుడు
author img

By

Published : Dec 24, 2020, 7:11 PM IST

స్ట్రాబెర్రీల సాగులో ఆదర్శంగా హైదరాబాద్​ యువకుడు

ఝార్ఖండ్​ లాతెహార్​ జిల్లాలోని నేతర్​హాట్​ ఎత్తైన ప్రాంతం. ఆ ప్రదేశాన్ని చోటానాగ్​పుర్​ పీఠభూమికి రాణిగా పిలుస్తారు. అది ఆహ్లాదకర వాతావరణం, పచ్చదనంతో పర్యటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. అయితే.. సాగు నీటి ఎద్దడి అధికంగా ఉండటం వల్ల రైతులు కొద్దిపాటి భూముల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, పసుపు, గుమ్మడి వంటి సంప్రదాయ పంటలను పండిస్తున్నారు. అలాంటి వారికి ఆశాకిరణంగా మారారు శ్రీనివాసన్​ రాజు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను వారికి పరిచయం చేసి లాభాల బాట పట్టిస్తున్నారు.

SRINIVASAN RAJU
వ్యవసాయ పనులను పరిశీలిస్తున్న శ్రీనివాసన్​ రాజు

హైదరాబాద్​కు చెందిన శ్రీనివాసన్​ రాజు.. కొన్నాళ్ల క్రితం తన బృందంతో బాక్సైట్​ మైనింగ్​ పనుల కోసం నేతర్​హాట్​కు వెళ్లారు. ఆ సమయంలో సమీప గ్రామాలను సందర్శిస్తూ.. రైతులతో మాట్లాడేవారు. ఇక్కడ ప్రధానంగా మొక్కజొన్న, వరిసాగు చేస్తున్నారని, నీటిఎద్దడి వల్ల మరో రకం పంటపై ఆలోచన చేయలేకపోతున్నారని తెలుసుకున్నారు.

శ్రీనివాసన్​ రాజు రైతు కుటుంబానికి చెందిన వారు కావటం వల్ల వ్యవసాయంపై మంచి పట్టు ఉంది. ఈ క్రమంలో నేతర్​హాట్​ భౌగోళిక అంశాలు, వాతావరణానికి అనువైన ప్రత్యామ్నాయ సాగు మార్గాలపై ఆలోచన చేశారు. రైతుల నుంచి 20 ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని సాగు చేయటం ప్రారంభించారు రాజు. చుట్టుపక్కల రైతులకు ఆధునిక పద్ధతులపై మెలుకువలు నేర్పిస్తూ సాగులో మంచి లాభాలు గడించేలా చేస్తున్నారు.

డ్రిప్​ ఇరిగేషన్​..

నేతర్​హాట్​లో సాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న క్రమంలో డ్రిప్​ ఇరిగేషన్​ను ఎంచుకున్నారు శ్రీనివాసన్​ రాజు. దీని ద్వారా తక్కువ నీటితోనే ఎక్కువ భూమిలో సాగు చేసేందుకు వీలు కలిగింది. అలాగే దిగుబడి కూడా పెరిగింది. రాజు నుంచి ఈ విషయాలు తెలుసుకున్న కొంత మంది నేతర్​హాట్​ రైతులు కూడా వారి భూముల్లో డ్రిప్​ ఇరిగేషన్​తో సాగు చేయటం ప్రారంభించారు.

SRINIVASAN RAJU
డ్రిప్​ ఇరిగేషన్​పై వివరిస్తున్న శ్రీనివాసన్​ రాజు

స్ట్రాబెర్రీ సాగు..

నేతర్​హాట్​​లో సాధారణంగా సాగు చేసే మిర్చి, టమాట, గుమ్మడి, అల్లం, పసుపు వంటి వాటితో పాటు ప్రత్యేకంగా స్ట్రాబెర్రీలను సాగు చేయటం ప్రారంభించారు శ్రీనివాసన్​ రాజు. మొదట్లో 2 ఎకరాల్లో సాగు చేసినప్పటికీ ఇప్పుడు పెద్దఎత్తున సాగు చేస్తున్నట్లు చెబుతున్నారు. వాటిని పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయటం వల్ల మంచి లాభాలు వస్తున్నట్లు తెలిపారు.

SRINIVASAN RAJU
స్ట్రాబెర్రీ సాగుపై వివరిస్తున్న శ్రీనివాసన్​ రాజు

"ఈ ప్రాంతంలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. బోరు వేసినప్పటికీ తక్కువగా నీరు వస్తోంది. దీంతో రైతులు వరి, మొక్కజొన్న పంటలనే సాగు చేస్తున్నారు. కొత్త రకాలపై ఆలోచన చేయటమే మానేశారు. ఇక్కడి వాతావరణం ఎలా ఉంటుంది. ఎలాంటి పంటలు పండుతాయి అని అలోచించినప్పుడు స్ట్రాబెర్రీ ఆలోచన వచ్చింది. ముందుగా ఇక్కడ స్ట్రాబెర్రీ నర్సరీ ఏర్పాటు చేశాం. మూడేళ్లపాటు పరిశోధన చేసి ఈ ఏడాది నుంచి పూర్తిస్థాయిలో సాగు చేయటం ప్రారంభించాం."

- శ్రీనివాసన్​ రాజు, రైతు

స్ట్రాబెర్రీ పంట సాధారణంగా డిసెంబర్​-ఫిబ్రవరి మధ్య ఎక్కువగా దిగుబడి వస్తుంది. అయితే.. నేతర్​హాట్​లో మార్చి- ఏప్రిల్​, అక్టోబర్​-నవంబర్​లోనూ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల ఈ కాలాల్లోనూ పండిస్తున్నామని చెబుతున్నారు రాజు.

ఇదీ చూడండి: ఆ రచయితకు రాయడం.. అమ్మడం రెండూ తెలుసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.