SP chief Akhilesh Yadav: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఎన్నికల కార్యక్రమానికి వెళ్లేందుకు తన హెలికాప్టర్‌ను అనుమతించకపోవటం వల్ల దిల్లీలోనే చిక్కుకుపోయానని ఆరోపించారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. ఈ మేరకు హెలికాప్టర్‌తో ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే, అందుకు గల కారణాలను వివరించలేదు.
-
मेरे हैलिकॉप्टर को अभी भी बिना किसी कारण बताए दिल्ली में रोककर रखा गया है और मुज़फ़्फ़रनगर नहीं जाने दिया जा रहा है। जबकि भाजपा के एक शीर्ष नेता अभी यहाँ से उड़े हैं। हारती हुई भाजपा की ये हताशा भरी साज़िश है।
— Akhilesh Yadav (@yadavakhilesh) January 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
जनता सब समझ रही है… pic.twitter.com/PFxawi0kFD
">मेरे हैलिकॉप्टर को अभी भी बिना किसी कारण बताए दिल्ली में रोककर रखा गया है और मुज़फ़्फ़रनगर नहीं जाने दिया जा रहा है। जबकि भाजपा के एक शीर्ष नेता अभी यहाँ से उड़े हैं। हारती हुई भाजपा की ये हताशा भरी साज़िश है।
— Akhilesh Yadav (@yadavakhilesh) January 28, 2022
जनता सब समझ रही है… pic.twitter.com/PFxawi0kFDमेरे हैलिकॉप्टर को अभी भी बिना किसी कारण बताए दिल्ली में रोककर रखा गया है और मुज़फ़्फ़रनगर नहीं जाने दिया जा रहा है। जबकि भाजपा के एक शीर्ष नेता अभी यहाँ से उड़े हैं। हारती हुई भाजपा की ये हताशा भरी साज़िश है।
— Akhilesh Yadav (@yadavakhilesh) January 28, 2022
जनता सब समझ रही है… pic.twitter.com/PFxawi0kFD
" ఎలాంటి కారణాలు చెప్పకుండానే నా హెలికాప్టర్‌ను నిర్బంధించారు. ఇక్కడి నుంచే ఓ భాజపా అగ్రనేత వెళ్లినప్పటికీ.. నేను ముజఫర్‌నగర్ వెళ్లేందుకు అనుమతించటం లేదు. ఇది భాజపా ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రే."
- అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధినేత.
అర్ధగంట తర్వాత మరో ట్వీట్ ద్వారా భాజపాపై విమర్శలు గుప్పించారు అఖిలేశ్. 'అధికార దుర్వినియోగం వారి ఓటమిని సూచిస్తోంది. సామాజిక ఉద్యమ చరిత్రలో ఈ రోజు కూడా చేరుతుంది. చరిత్రను మార్చే చారిత్రక పోరాటాన్ని చేయబోతున్నాం.' అని పేర్కొన్నారు.
అఖిలేశ్ యాదవ్, ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌధరిలు ముజఫర్‌నగర్‌లోని పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: ఎస్పీకి ములాయం కుటుంబ సభ్యుల గుడ్‌బై- అఖిలేశ్‌కే లాభమా?