ETV Bharat / bharat

ఝార్ఖండ్​లో లాక్​డౌన్​- దేశవ్యాప్తంగా కఠిన చర్యలు

author img

By

Published : Apr 20, 2021, 6:09 PM IST

దేశంలో కరోనా కేసులు బెంబేలెత్తుతున్న వేళ.. ఆయా రాష్ట్రాలు లాక్​డౌన్​ అస్త్రాన్ని ఎంచుకుంటున్నాయి. తాజాగా.. ఝార్ఖండ్​లో వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్​డౌన్ విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మరోవైపు.. మహారాష్ట్రలోని ఇప్పటికే జనతా కర్ఫ్యూ అమల్లో ఉండగా.. తాజాగా నిత్యావసరాలపైనా ఆంక్షలు విధించింది ఠాక్రే సర్కార్​. కేవలం 4 గంటలపాటే అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Lockdown, Night Curfew
లాక్​డౌన్​

కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఝార్ఖండ్‌ ప్రభుత్వం కట్టడి చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 22 నుంచి 29 వరకు వారం రోజులపాటు లాక్‌డౌన్‌ విధించింది. అత్యవసర సేవలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

దుకాణాలు 4 గంటలే..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పటికే అక్కడ జనతా కర్ఫ్యూ అమల్లో ఉండగా.. తాజాగా నిత్యావసరాలపై కూడా ఆంక్షలు విధించింది. కిరాణాలు, కూరగాయలు, పండ్లు తదితర దుకాణాలు కేవలం 4 గంటల పాటే తెరవాలని ఆదేశించింది. ఇకపై.. రాత్రి 8 గంటల తర్వాత హోం డెలివరీని నిలిపివేసింది. ఈ మేరకు ఠాక్రే సర్కార్​.. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

"కిరాణాలు, కూరగాయల దుకాణాలు, పండ్ల విక్రయాలు, బేకరీలు, అన్ని రకాల ఆహార దుకాణాలు(మాంసం విక్రయాలు కూడా), వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు అమ్మే దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. హోం డెలివరీలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య చేయాలి" అని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. తాజా ఆంక్షలు మంగళవారం రాత్రి 8 గంటల నుంచి మే 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది.

రద్దీని తగ్గించేందుకు..

తమిళనాడులో కరోనా ఆంక్షల నడుమ ఇంటికి వెళ్లాలనుకునే వలస కార్మికుల రద్దీని తగ్గించేందుకు దక్షణ రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు కూలీల కోసం ప్రత్యేక రైళ్లను నడపడం లేదా ఉన్న రైళ్లకే అదనపు బోగీలను అమర్చేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

తమిళనాడులో రాత్రి కర్ఫ్యూ(రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు) అమల్లో ఉండగా.. రైళ్ల రాకపోకల సమయాలేవీ మార్చడం లేదని ఆ అధికారి పేర్కొన్నారు. దీనికి సంబంధించి.. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన అందలేదని ఆయన వెల్లడించారు. చెన్నై నుంచి సుదూర ప్రాంతాలకు రైళ్లు వెళ్లనున్న నేపథ్యంలో.. మార్పులు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

ప్రత్యేక గదులు

కరోనా ఉద్ధృతి వేళ.. ఆయా రాష్ట్రాలు విధిస్తున్న ఆంక్షలతో వలస కార్మికుల మనోవేదనల్ని పరిష్కరించేందుకు కేంద్ర కార్మిక శాఖ చర్యలు చేపట్టింది. వారికోసం 20 కంట్రోల్​ రూమ్​లను ఏర్పాటు చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. దీని ద్వారా ప్రత్యేక అధికారులను నియమించి.. కూలీల వేతనాల చెల్లింపు సమస్యలు, ఇతర ఫిర్యాదులను పరిష్కరిస్తారు.

గతేడాది ఇదే తరహాలో.. కార్మికుల కోసం 20 కంట్రోల్​ రూమ్​లను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. అయితే.. ఈ సారి అందులో పాల్గొనే సిబ్బంది సంఖ్య మరింత పెంచినట్టు పేర్కొంది. ఫలితంగా లక్షలాది మంది కార్మికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. మొత్తం 20 కాల్​ సెంటర్ల పనితీరును కేంద్రంలోని ప్రధాన కమిషనర్​.. రోజూ పర్యవేక్షిస్తారని తెలిపింది.

దిల్లీ ఆర్మీ ఆస్పత్రిని కొవిడ్​ కేంద్రంగా..

దిల్లీలో సైనికులకు సంబంధించిన ఆసుపత్రిని సాయుధ బలగాలు సిబ్బంది, ఇతర సిబ్బంది కోసం ప్రత్యేక కొవిడ్​ కేంద్రం​గా మారుస్తున్నట్టు భారత సైన్యం తెలిపింది. ఈ సౌకర్యాలు గురువారం(ఈ నెల 22) నుంచి అందుబాటులో ఉండనున్నాయని ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది. తద్వారా ఆ ఆస్పత్రికి సంబంధించిన అన్ని ఓపీడీ(అవుట్​ పేషెంట్​ డిపార్ట్​మెంట్​)లు ఆర్మీ రీసెర్చ్​ అండ్​ రెఫరల్​(ఏహెచ్​ఆర్​ఆర్​)కు బదిలీ అవుతాయని సైన్యం వివరించింది.

ఇదీ చదవండి:'ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.