South Western Railway Jobs : రైల్వే ఉద్యోగాలు లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న యువతకు గుడ్ న్యూస్. సౌత్ వెస్ట్రన్ రైల్వే 904 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు RRC SWR అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
డివిజన్లు వారీగా పోస్టుల వివరాలు
Railway ITI Vacancy 2023 :
- హుబ్బళ్ళి - 237
- క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హుబ్బళ్ళి - 217
- బెంగళూరు - 203
- మైసూర్ - 177
- సెంట్రల్ వర్క్‌షాప్, మైసూర్ - 43
విద్యార్హతలు ఏమిటి?
Railway Apprentice Eligibility : అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ లేదా విద్యాసంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఐటీఐ (NCVT/SCVT)లో సంబంధిత ట్రేడ్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి ఎంత ఉండాలి?
Railway Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు కనిష్ఠంగా 15 సంవత్సరాలు, గరిష్ఠంగా 24 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము ఎంత చెల్లించాలి?
Railway Apprentice Application Fee : జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
Railway Apprentice Selection Process : 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ఉన్న అభ్యర్థులను ట్రేడ్ అప్రెంటీస్లుగా ఎంపిక చేస్తారు.
శిక్షణ కాలం
Railway Apprentice Training : ఇండియన్ రైల్వే నిబంధనలు ప్రకారం.. ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు ప్రెంటీస్ శిక్షణ ఉంటుంది. స్టైఫండ్ కూడా ఇస్తారు. ఉపాధితో పాటు మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ సంపాదించానుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. కానీ ట్రైనింగ్ పీరియడ్‌లో ఎలాంటి హాస్టల్ వసతి కల్పించరు.
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు https://swr.indianrailways.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి, అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తరువాత వ్యక్తిగత వివరాలతోపాటు, విద్యా సంబంధమైన వివరాలు నమోదు చేస్తూ దరఖాస్తును పూరించాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. ముఖ్యంగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని, అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు కాపీని ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : 2023 జులై 03
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 02
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://swr.indianrailways.gov.in/ లో అప్లై చేసుకోవచ్చు.