ETV Bharat / bharat

స్కూల్​ దుస్థితిపై పేద విద్యార్థి రిపోర్టింగ్​కు సోనూసూద్ ఫిదా, భారీ సాయం ప్రకటన - సోనూసూద్​ సహాయం

Sonu sood help for education నటుడు సోనూసూద్​ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల తన స్కూల్​ దుస్థితిపై రిపోర్టింగ్​ చేసి సోషల్​ మీడియాలో వైరల్​ అయిన సర్ఫరాజ్​కు సాయం ప్రకటించారు​. ఆ పేద విద్యార్థి చదువు బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

sonu sood help for education
sonu sood help for education
author img

By

Published : Aug 24, 2022, 6:06 PM IST

వైరల్​గా మారిన రిపోర్టర్​ స్టూడెంట్​కు సోనూసూద్​ సాయం

Sonu sood help for education: కరోనా కాలంలో ఎందరికో సహాయం చేసి ప్రశంసలు అందుకున్నారు నటుడు సోనూసూద్​. ఇప్పటికీ తమకు సాయం చేయాలంటూ అనేక మంది సోషల్​ మీడియాలో ఆయనను సంప్రదిస్తుంటారు. అయితే, తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు సోనూసూద్​. సర్ఫరాజ్​ అనే పేద విద్యార్థి చదువు బాధ్యతల్ని తీసుకున్నారు.
ఇటీవల తన పాఠశాల దుస్థితిని వివరిస్తూ రిపోర్టింగ్​ చేశాడు సర్ఫరాజ్​. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ మారింది. దీనిని చూసిన సోనూసూద్​ తాజాగా స్పందించారు. సర్ఫరాజ్​ చదువు కోసం ముంబయిలో అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Sonu sood help for education
రిపోర్టింగ్​ చేస్తున్న సర్ఫరాజ్​

ఝార్ఖండ్‌ గొడ్డా జిల్లాలోని మహ్గామా బ్లాక్‌లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొన్నేళ్లుగా అనేక సమస్యలు తిష్టవేశాయి. దీంతో విద్యార్థుల శాతం కూడా తగ్గిపోయింది. దీన్నంతా గమనించిన సర్ఫరాజ్​ అనే ఓ 12 ఏళ్ల విద్యార్థి రిపోర్టర్ అవతారం ఎత్తాడు. ఓ ప్లాస్టిక్ బాటిల్‌కు కర్ర తగిలించి మైక్ తరహాలో తయారు చేశాడు. దాన్ని పట్టుకుని సమస్యలను చూపిస్తూ వివరించాడు.

Sonu sood help for education
రిపోర్టింగ్​ చేస్తున్న సర్ఫరాజ్​

పిచ్చి మొక్కలను చూపిస్తున్న విద్యార్థి "మా గ్రామంలో పాఠశాల పరిస్థితి గురించి మీకు వివరిస్తా. విద్యార్థులకు కనీసం తాగడానికి నీరు కూడా లేదు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. మరుగుదొడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. తరగతి గదుల్లో పశువుల మేతను పడేస్తున్నారు. ఇక ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థులు సక్రమంగా రావడం లేదు".. అంటూ తమ పాఠశాలలోని దుస్థితిని కళ్లకుగట్టాడు. పక్కనే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు.. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని కామెంట్లు పెట్టి షేర్​ చేశారు.

Sonu sood help for education
రిపోర్టింగ్​ చేస్తున్న సర్ఫరాజ్​

ఇద్దరు టీచర్లు సస్పెండ్​.. అయితే సర్ఫరాజ్​ రిపోర్టింగ్​ వీడియో తెగ​ వైరల్​ కావడం వల్ల జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి రజినీ కుమారి స్పందించారు. వెంటనే పాఠశాలకు సంబంధించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్​ చేశారు. పాఠశాల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ మంత్రి జగన్నాథ్​ మాతో.. సర్ఫరాజ్​ను పిలిపించుకొని పాఠశాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చదవండి: వాట్సాప్​ సాయంతో MBAవాలా ఆర్గానిక్ వ్యవసాయం, భారీగా ఆదాయం

సీఎం సహాయకుడి ఇంట్లో ఈడీ సోదాలు, నగదు కోసం వెళ్తే బయటపడ్డ ఏకే47 రైఫిళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.