కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వారసత్వ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రముఖ నేతలు.. తమ బంధువులు, కూతుళ్లు, అల్లుళ్లను బరిలోకి దింపుతున్నారు. మొత్తం 140 స్థానాలున్న అసెంబ్లీలో.. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ నుంచి 20కి పైగా స్థానాల్లో ఈ తరహా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు.
కేరళ సీఎం పినరయి విజయన్ అల్లుడు పీఏ మహమ్మద్ రియాస్.. ఈ ఎన్నికల్లోనే రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. బేపోర్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. ఇక కేరళ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్ కుమారుడు కే. మురళీధరన్.. నెమోమ్ నుంచి పోటీ చేస్తుండగా.. కరుణాకరన్ కుమార్తె పద్మజా వేణుగోపాల్.. త్రిస్సూర్ నుంచి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు.
'ముందన్ ఉద్యమం' మహిళా మోర్చా మాజీ అధ్యక్షులు లతికా సుభాష్‌కు యూడీఎఫ్ టికెట్ నిరాకరించింది. దీంతో ఆమె ఎట్టుమనూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
ఇదీ చదవండి : శబరిమల కోసం ప్రత్యేక చట్టం: భాజపా హామీ
కార్యకర్తలు అర్హులు కారా?
వారసత్వ అండతో రాజకీయాల్లో అరంగేట్రం చేసేవారికి ప్రజాదరణ ఉంటేనే రాణిస్తారని రాజకీయ పార్టీలు చెబుతుంటాయి. అయితే.. చాలా పార్టీలు తమకు ప్రజాదరణ ఉన్నవారే కావాలని కోరుకుంటున్నట్టు చెబుతాయి. అదే సమయంలో పార్టీ కార్యకర్తలకు టికెట్లు నిరాకరిస్తాయని.. వారు అర్హులు కారా? అని రాజకీయ విశ్లేషకులు జే ప్రభాశ్ ప్రశ్నించారు.
యూడీఎఫ్‌లోనే అధికం
వారసత్వ రాజకీయాలు కేరళలోనూ అధికంగా కనిపిస్తున్నాయని మరో రాజకీయ విశ్లేషకులు ఏ. జయశంకర్ అభిప్రాయపడ్డారు. యూడీఎఫ్‌లోనే ఇలాంటి రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. గత యూడీఎఫ్ ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులు.. రాజకీయ నాయకుల వారసులేనన్నారు. వారసత్వ రాజకీయాలకు మార్క్సిస్ట్ పార్టీ అతీతం కాదన్నారు.
ఇవీ చదవండి : కేరళలో కామ్రేడ్ల నోట శబరిమల మాట
'కేంద్రం విధ్వంసకాండలో తలారిలా కాంగ్రెస్'
'కేరళలో అధికారం లేదా 'కింగ్‌మేకర్'గా భాజపా'