ETV Bharat / bharat

మహిళా రెజ్లర్ నిశా దారుణ హత్య- సుశీల్ అకాడమీకి నిప్పు

మహిళా రెజ్లర్ నిశా దహియాను దుండుగలు కాల్చి చంపారు. హరియాణాలో జరిగిన ఈ దాడిలో ఆమె సోదరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు సుశీల్​ కుమార్ అకాడమీకి నిప్పంటించారు.

sonipat female wrestler nisha and his brother shot dead
జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ దారుణ హత్య
author img

By

Published : Nov 10, 2021, 7:02 PM IST

Updated : Nov 10, 2021, 10:38 PM IST

హరియాణా సోనిపత్​లో మహిళా రెజ్లర్ నిశా దహియా దారుణ హత్యకు గురైంది. దుండుగులు ఆమె కుటుంబంపై తుపాకులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిశాతో పాటు ఆమె సోదరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తుపాకీ తూటాలు తగిలి, తీవ్ర గాయాలపాలైన ఆమె తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

సోనిపత్​ హలాల్​పుర్ గ్రామంలో రెజ్లర్ సుశీల్ కుమార్ అకాడమీలో ఈ దారుణ ఘటన జరిగింది. నిశా హత్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు సుశీల్ అకాడమీకి నిప్పుపెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నిశా హత్య అనంతరం సుశీల్ అకాడెమీకి నిప్పు పెట్టిన గ్రామస్థులు

గందరగోళం..

నిశా హత్య అనంతరం కాసేపు గందరగోళం నెలకొంది. చనిపోయింది అండర్​-23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్, జాతీయ మహిళా రెజ్లర్​ నిశా దహియానే అని ప్రచారం జరిగింది. అయితే హత్యకు గురైంది ఛాంపియన్ నిశా కాదని, కొత్తగా రెజ్లింగ్​లోకి అడుగుపెడుతున్న మరో నిశా తర్వాత తెలిసింది.

నిశాను కాల్చిచంపింది ఆమె కోచ్​, అతని స్నేహితులే అని పోలీసుల వెల్లడించారు.

జాతీయ రెజ్లర్ నిశా ప్రస్తుతం ఉత్తర్​ప్రదేశ్​లో ఉందని, సీనియర్​ నేషనల్స్​ కోసం సన్నద్దం అవుతోందని భారత రెజ్లింగ్ సమాఖ్య వీడియో విడుదల చేసింది.

Last Updated : Nov 10, 2021, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.