ETV Bharat / bharat

సోనియా, రాహుల్​ టీకా తీసుకున్నారా? - భాజపాపై రాహుల్​ విమర్శలు

కొవిడ్​ టీకాల పంపిణీ విధానంపై కేంద్రాన్ని విమర్శిస్తున్న గాంధీ కుటుంబీకులు వ్యాక్సిన్​ తీసుకున్నారా? అని భాజపా నేతలు ప్రశ్నించిన క్రమంలో స్పష్టతనిచ్చింది కాంగ్రెస్​. సోనియా గాంధీ రెండు డోసులు తీసుకున్నారని తెలిపింది. రాహుల్​ గాంధీ త్వరలోనే తీసుకుంటారని వెల్లడించింది.

Rahul gandhi
రాహుల్​ గాంధీ
author img

By

Published : Jun 17, 2021, 2:38 PM IST

గాంధీ కుటుంబీకులు కొవిట్​ టీకా తీసుకున్నారా? అని భాజపా నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో స్పష్టత ఇచ్చింది కాంగ్రెస్​. అధ్యక్షురాలు సోనియా గాంధీ కొవిడ్​-19 వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్నట్లు తెలిపింది. ఇతర అంశాలను లేవనెత్తుతూ గందరగోళం సృష్టించకుండా.. దేశ ప్రజలందరికీ టీకా పంపిణీలో రాజ ధర్మాన్ని పాటించాలని ప్రభుత్వానికి సూచించింది.

ప్రియాంకా గాంధీ తొలి డోసు తీసుకున్నారని పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా తెలిపారు. రాహుల్ గాంధీ కరోనా నుంచి కోలుకున్నారని, వైద్యుల సూచన మేరకు సరైన సమయంలో టీకా తీసుకుంటారని స్పష్టం చేశారు.

"2021, డిసెంబర్​ 31 నాటికి 100 కోట్ల ప్రజలకు టీకా అందించే లక్ష్యాన్ని చేరుకునేందుకు మోదీ ప్రభుత్వం ఎలాంటి గందరగోళం సృష్టించకుండా రోజుకు 80 లక్షల నుంచి కోటి మందికి టీకా అందించటంపై దృష్టిసారించాలి. టీకా పంపిణీలో ఆచరించాల్సిన రాజ ధర్మం ఇదే. హర్షవర్ధన్​ భారత ఆరోగ్య శాఖ మంత్రి. కాంగ్రెస్​ అధ్యక్షురాలు టీకా రెండు డోసులు తీసుకున్నారనే విషయాన్ని తెలిసి ఉండాలి. రాహుల్​ గాంధీ 2021, ఏప్రిల్​ 16న వ్యాక్సిన్​ తీసుకోవాల్సి ఉంది. అయితే.. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటం వల్ల ఏప్రిల్​ 18న నిర్వహించిన ఆర్​టీపీసీఆర్​ పరీక్షల్లో పాజిటివ్​గా తేలింది. కొవిడ్​ నుంచి కోలుకున్నారు. వైద్యుల సలహా మేరకు టీకా తీసుకుంటారు."

- రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి.

ప్రియాంకా గాంధీ తొలి డోసు తీసుకున్నాక మార్చి 28న ఆమె భర్తకు వైరస్​ సోకిందని తెలిపారు సుర్జేవాలా. ఆ తర్వాత ఆమెకు సైతం పాజిటివ్​గా తేలినట్లు చెప్పారు. టీకా వ్యవధిని అనుసరించి ఇరువురు టీకా తీసుకుంటారని స్పష్టం చేశారు.

మోదీ.. తన తప్పును ఒప్పకోవాలి: రాహుల్​

ప్రధాని నరేంద్ర మోదీ తన తప్పులను అంగీకరించి, నిపుణుల సహాయం కోరిన తర్వాతే భారత్ పునర్నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు రాహుల్​ గాంధీ. కొవిడ్​ మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా పేదరికంలోకి వెళ్లిన వారిలో 57.3 శాతం భారత్​లోనే ఉన్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక చెబుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అది భారత ప్రభుత్వం మహమ్మారిని ఎదుర్కొన్న తీరుకు నిదర్శనమని విమర్శించారు. అయితే.. భవిష్యత్తు కోసం ఆలోచించాలని సూచించారు. తిరస్కరణ భావంతో జీవించటం వల్ల దేనినీ పరిష్కరించలేమని హితవు పలికారు.

ఇదీ చూడండి: కుంభమేళాలో నకిలీ కరోనా రిపోర్టులు- 'అడ్రెస్' లేని ల్యాబ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.