ETV Bharat / bharat

పదేళ్లుగా ఆఫీస్​ రెంట్ కట్టని కాంగ్రెస్​- ఏడాదిన్నరగా సోనియా ఇంటి అద్దె బాకీ! - రెంటు

Sonia Gandhi house rent pending: దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, సోనియా గాంధీ అధికారిక నివాసం సహా మరికొందరు కాంగ్రెస్​ నేతలు ఉంటున్న భవనాలకు అనేక ఏళ్లుగా అద్దె చెల్లించడం లేదని తెలిసింది. కాంగ్రెస్​ ఆఫీసుకు సంబంధించి ప్రభుత్వానికి రూ.12.69లక్షలు బకాయి ఉన్నట్లు స.హ. చట్టం దరఖాస్తు ద్వారా తెలిసింది.

Sonia Gandhi's residence
సోనియా గాంధీ
author img

By

Published : Feb 10, 2022, 2:42 PM IST

  • రూ.12,69,902... దిల్లీలోని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయ భవనం అద్దె బకాయి.
  • రూ.4,601.. సోనియా గాంధీ అధికారిక నివాసం అద్దె బాకీ.
  • రూ.5,07,911.. సోనియా వ్యక్తిగత కార్యదర్శి నివాసం అద్దె బకాయి.

సుజిత్ పటేల్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా.. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ చెప్పిన లెక్కలివి.

పదేళ్లుగా అద్దె కట్టని కాంగ్రెస్​

Congress Office rent due: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం.. దిల్లీ అక్బర్​ రోడ్​లోని 26వ నెెంబర్ భవనంలో ఉంది. 2012 డిసెంబర్ తర్వాత ఆ భవనం అద్దెను చెల్లించలేదు కాంగ్రెస్. మొత్తం రూ.12లక్షలకుపైగా బకాయి పడింది.

జాతీయ, రాష్ట్ర పార్టీలకు ప్రభుత్వ భవనాల కేటాయింపునకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆయా పార్టీలు సొంత భవనం కట్టుకునేందుకు మూడేళ్లు సమయం ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే.. 2010 జూన్​లోనే దిల్లీ రౌజ్​ ఎవెన్యూలో కాంగ్రెస్​ పార్టీకి భూకేటాయింపు జరిగింది. అయినా.. భవన నిర్మాణం పూర్తి కాలేదు. 2013లోనే అక్బర్​ రోడ్ కార్యాలయాన్ని కాంగ్రెస్ ఖాళీ చేయాల్సి ఉంది. అయితే.. అనేక సార్లు ఆ గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరింది ఆ పార్టీ.

2020 జులైలో లోధి రోడ్​లోని ప్రభుత్వ భవనాన్ని నెల రోజుల్లోగా ఖాళీ చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్రం నోటీసులిచ్చింది. ఫలితంగా అప్పుడు ప్రియాంక వేరే ఇంటికి మారాల్సి వచ్చింది.

సోనియా సెక్రటరీ భారీ బకాయి

Sonia Gandhi house rent Delhi: జనపథ్​ రోడ్​లోని 10వ నెంబర్ ఇంట్లో ఉంటున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. 2020 సెప్టెంబర్ నుంచి ఆ భవనం అద్దె చెల్లించలేదు. రూ.4,610 బకాయి ఉంది.

చాణక్యపురిలోని C-11/109 భవనంలో సోనియా వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జ్ ఉంటున్నారు. ఆ భవనం అద్దెను 2013 ఆగస్టు నుంచి చెల్లించలేదు. మొత్తం బాకీ రూ.5,07,911.

Sonia Gandhi's residence not paid
సోనియా గాంధీ ఇల్లు, కాంగ్రెస్​ కార్యాలయాల అద్దెల వివరాలు

స్కాముల్లేవ్.. పైసల్లేవ్...

అద్దె బకాయిల వ్యవహారంపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది భాజపా. "ఎన్నికల్లో ఓడిపోయాక సోనియా గాంధీ అద్దె చెల్లించలేకపోతున్నారు. ఇప్పుడు కుంభకోణాలు చేయడానికి వీలు లేకపోవడమే ఇందుకు కారణమన్నది సుస్పష్టం. అయితే.. రాజకీయ భేదాభిప్రాయాలు పక్కనబెట్టి మానవత్వంతో నేను ఆమెకు సాయం చేయాలని అనుకుంటున్నా. అందుకే #SoniaGandhiReliefFund కార్యక్రమం ప్రారంభించి ఆమె ఖాతాకు రూ.10 బదిలీ చేశా. మీ అందరూ కూడా సాయం చేయాలని కోరుతున్నా" అని ట్వీట్ చేశారు భాజపా నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా.

ఇదీ చూడండి: చలానా కోర్టులో కడతానన్నందుకు.. యువకుడిపై ట్రాఫిక్​ పోలీస్​ దాడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.