దేశంలో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలతో పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ శుక్రవారం భేటీ కానున్నారు. ఆన్లైన్ విధానంలో సమావేశం జరుగుతుంది. ప్రస్తుత కొవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన రాజకీయ వ్యూహంపై ఈ సందర్భంగా చర్చిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బడ్జెట్ సమావేశాల తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుండటం ఇదే తొలిసారి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు సమావేశంలో పాల్గొంటారు.
ఇదీ చూడండి: రెమ్‌డెసివిర్ రవాణా చేస్తున్న విమానం క్రాష్ ల్యాండింగ్
ఇదీ చూడండి: కమల్‌హాసన్‌కు ఎదురుదెబ్బ- పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా