ETV Bharat / bharat

తండ్రి మరణించాడని వైద్య విద్యార్థినిపై దాడి! - కర్ణాటక బళ్లారిలో వైద్య విద్యార్థినిపై దాడి

కరోనాతో చికిత్స పొందుతూ తన తండ్రి మృతి చెందాడని ఆగ్రహానికి లోనయ్యాడు ఓ వ్యక్తి. కొవిడ్​ వార్డులో విధులు నిర్వర్తించే వైద్య విద్యార్థినిపై దాడి చేశాడు. ఈ ఘటన కర్ణాటక బళ్లారిలో జరిగింది.

assaul on medical student
ఆస్పత్రిలో దాడి
author img

By

Published : May 24, 2021, 10:16 AM IST

వైద్య విద్యార్థినిపై దాడి చేస్తున్న దృశ్యాలు

కరోనా ఆపత్కాలంలో వైద్య సిబ్బంది సేవలను అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ, కర్ణాటక బళ్లారి జిల్లాలో ఓ వ్యక్తి మాత్రం.. వారిపైనే తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు.

ఏం జరిగిందంటే..

బళ్లారి తాలుకాలోని సంగనగల్లు గ్రామానికి చెందిన మల్లికార్జున గౌడ అనే వ్యక్తికి ఇటీవల కరోనా సోకగా.. చికిత్స కోసం బళ్లారిలోని విమ్స్​ ఆస్పత్రిలో చేరారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. మల్లికార్జున గౌడ మరణవార్త తెలుసుకున్న ఆయన కుమారుడు తిప్పెస్వామి ఆగ్రహానికి లోనయ్యాడు. కొవిడ్​ చికిత్స కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్య విద్యార్థినిపై దాడికి పాల్పడ్డాడు. ఆకస్మాత్తుగా ఆమె చెంపపై కొట్టాడు. అనంతరం.. ఆమెను నెట్టేశాడు.

ఈ దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దీనిపై కౌల్​ బజార్​ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

ఇదీ చూడండి: కరోనా మారణహోమం- 3లక్షలు దాటిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.