ETV Bharat / bharat

నేటి నుంచే '18 ప్లస్'​కు టీకా.. కొన్ని రాష్ట్రాల్లోనే!

author img

By

Published : May 1, 2021, 5:26 AM IST

Updated : May 1, 2021, 6:35 AM IST

దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీలో మరో ఘట్టం ఆవిష్కృతం కానుంది. 18 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి నేటి నుంచి టీకా అందనుంది. అయితే కొన్ని రాష్ట్రాలకే ఈ కార్యక్రమం పరిమితం కానుంది.

Some states to being jabs for 18-44 yrs on May 1
నేటి నుంచే '18ప్లస్'​కు టీకా... కొన్ని రాష్ట్రాల్లోనే!

దేశంలో కరోనా టీకా పంపిణీలో మరో కీలక అధ్యాయానికి తెర లేవనుంది. 18 ఏళ్లు పైబడినవారికి ఇవాళ్టి నుంచి పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ అందనుంది. ఇప్పటికే తయారీదారులతో సమన్వయం చేసుకున్న రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని కేంద్రం వెల్లడించింది. టీకా పంపిణీ కార్యక్రమం మూడో దశ ఊపందుకునేందుకు సమయం పడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ అందిస్తే తప్ప.. ఈ దశలో టీకా ఉచితం కాదని స్పష్టం చేసింది.

ఇప్పటివరకు రాష్ట్రాలకు 15 కోట్ల కొవిడ్ టీకా డోసులను ఉచితంగా అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 45 ఏళ్లు పైబడినవారికి, ప్రాధాన్య జాబితాలో ఉన్న వ్యక్తులకు టీకా పంపిణీ ఉచితంగానే కొనసాగుతుందని వివరణ ఇచ్చారు.

అనేక రాష్ట్రాలు దూరం

దేశవ్యాప్తంగా టీకా పంపిణీలో భాగంగా మే 1 నుంచి 18-45 ఏళ్ల మధ్య వయస్కులకు వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే కరోనా టీకాల కొరత కారణంగా పలు రాష్ట్రాలు ఈ తంతుకు దూరంగా ఉన్నాయి. గుజరాత్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు మాత్రమే మూడో దశ టీకా పంపిణీని నేటి నుంచి ప్రారంభిస్తామని ప్రకటించాయి. ఆయా రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువ ఉన్న జిల్లాల్లోనే 18-45 ఏళ్ల మధ్య వయసు వారికి టీకాను అందించనున్నారు. అపోలో, మ్యాక్స్‌, ఫోర్టిస్‌ ఆసుపత్రులు మాత్రం 18 నుంచి 45 ఏళ్ల వారికి.. శనివారం నుంచి నిర్ణీత ధరకు టీకా వేస్తామని ప్రకటించాయి.

మహారాష్ట్ర

18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలన్న అంశంపై మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే స్పందించారు. తక్షణం 25 నుంచి 30 లక్షల వ్యాక్సిన్‌ వయల్స్‌ రాష్ట్రానికి రాకపోతే మూడో విడత వ్యాక్సినేషన్‌ నిర్వహించడం సాధ్యం కాదని చెప్పేశారు. "కరోనా మూడో విడత వ్యాప్తి కూడా పొంచి ఉంది. రాష్ట్రానికి 12 కోట్ల డోసులు అవసరముంది" అని ఆయన చెప్పుకొచ్చారు.

మరోవైపు, ముంబయి నగర కార్పొరేషన్‌ పరిధిలో వ్యాక్సినేషన్‌ కొనసాగనుంది. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య టీకా పంపిణీ ఉంటుందని బృహన్​ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికే టీకా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

కర్ణాటక

మూడో విడత వ్యాక్సినేషన్‌పై కర్ణాటకలోనూ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. శనివారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించడానికి అవసరమైనన్ని వయల్స్‌ రాష్ట్రంలో లేవని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు. 'కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కోటి డోసులను ఆర్డర్‌ చేశాం. అయితే వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు ఇంకా వాటిని అందించలేదు. అందువల్ల 18-44 మధ్య వాళ్లు వ్యాక్సిన్‌ కోసం ఆస్పత్రులకు వెళ్లొద్దు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కచ్చితంగా తెలియజేస్తాం' అని చెప్పారు.

దిల్లీ

దిల్లీలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం చెప్పినప్పటికీ దిల్లీలో అదే మాత్రం కార్యరూపం దాల్చే పరిస్థితులు కనిపించడం లేదు. వ్యాక్సిన్‌ కోసం కేంద్రాల ఎదుట ఎవరూ బారులు తీరవద్దని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్లు అందలేదని, దీని కోసం వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలతో మాట్లాడుతున్నామని చెప్పారు. త్వరలోనే టీకాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

గోవా

రాష్ట్రంలో వ్యాక్సిన్‌ నిల్వలు లేవని, అందువల్ల మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడం కుదరదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తామన్నారు. అదెప్పుడన్నది చెప్పలేమన్నారు.

మధ్యప్రదేశ్‌

మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడం లేదని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు సకాలంలో డోసులను సరఫరా చేయలేకపోయినందున ఇది సాధ్యపడలేదన్నారు. అయితే 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు.

బంగాల్​..

18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్‌ చేపట్టాలంటే కనీసం మూడు కోట్ల డోసులను సరఫరా చేయాల్సిందిగా బంగాల్​ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రభుత్వ ఆస్పత్రులకు 2 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు కోటి డోసులు సమకూర్చాలని కోరింది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న కోటి మందికి రెండు కోట్ల డోసులు అవసరమవుతాయని, మిగతా 50 లక్షల మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో వేయించుకుంటారని చెప్పింది.

పంజాబ్‌

వ్యాక్సిన్ల కొరత కారణంగా పంజాబ్‌లో మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌సింగ్‌ స్పష్టం చేశారు. "రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్లు రాలేదు. అందుకే సమస్యలు ఎదురవుతున్నాయి. మనకు తగిన సిబ్బంది, వసతులు ఉన్నాయి. వ్యాక్సిన్లు వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం" అని ఆయన చెప్పారు.

తెలంగాణ

రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లను అందించాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. "ఇది కేంద్రం బాధ్యత. భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపాం. అయితే, వ్యాక్సిన్ల లభ్యతపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థల నుంచి ఏదైనా సమాచారమొస్తే మూడో విడత వ్యాక్సినేషన్‌పై క్లారిటీ వస్తుంది" అని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో 18 ఏళ్లు దాటిన వారికి నేటి నుంచి వ్యాక్సిన్ వేయడం లేదని ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. 45ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఇంకా పూర్తికాకపోవటం, టీకా లభ్యత తక్కువగా ఉండడం వల్ల సాధ్యం కాదంటూ ప్రధాని నరేంద్ర మోదీకి.. సీఎం జగన్ లేఖ రాయనున్నట్లు వివరించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కో వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థకూ 50 లక్షల డోసుల చొప్పున కోటి డోసులను ఆర్డర్‌ చేశామని, అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేదని యూపీ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ప్రస్తుత నిల్వలు కేవలం 45 ఏళ్లు పైబడిన వారికే సరిపోతాయని స్పష్టం చేశారు.

మరోవైపు, కేంద్రం తన మార్గదర్శకాలను సమర్థించుకుంటోంది. రాష్ట్రాల వద్ద ప్రస్తుతం కోటి డోసులు అందుబాటులో ఉన్నాయని, మరి కొన్ని రోజుల్లో మరో 20 లక్షల డోసులు వస్తాయని అంటోంది.

ఇదీ చదవండి- ముందే ముగిసిన కుంభమేళా- 70 లక్షల మంది హాజరు

Last Updated : May 1, 2021, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.