ఖాళీ సమయంలో ఎవరైనా ఎలా గడుపుతారు? సాధారణంగా అయితే పుస్తకాలు చదవటం, గరిట తిప్పడం వంటి పనులు చేస్తుంటారు. కానీ సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ కేఎమ్ నటరాజ్.. వ్యవసాయం చేస్తున్నారు. ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. వ్యవసాయాన్ని మాత్రం వదిలేయకూడదని తన చర్యలతో చాటిచెబుతున్నారు. ముఖ్యంగా యువత సాగు రంగంలోకి అడుగుపెట్టాలని సందేశాన్నిస్తున్నారు.
'నా రక్తమే అది..'
నటరాజ్.. కర్ణాటక, దక్షిణ కన్నడ జిల్లాలోని ఈశ్వర మంగళమ్ ప్రాంతానికి చెందినవారు. ఆయనది వ్యవసాయ కుటుంబం. తల్లితండ్రులు సాగుపైనే ఆధారపడి జీవించారు. చాలాకాలంగా వారు వరిసాగు చేస్తున్నారు. అందుకే ఇప్పటికీ ఆయనకు వ్యవసాయమంటే ఎనలేని ప్రేమ, ఆసక్తి. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణంగా ఆయన కూడా కుటంబంతో పాటు సరదాగా సాగులో పాలుపంచుకుంటున్నారు. 'వ్యవసాయం నా రక్తంలోనే' ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
నటరాజన్ పని చేస్తుండగా.. ఆయన కుటంబసభ్యులు తీసిన వీడియోపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇవీ చదవండి:భారత టాప్-20 బిలియనీర్లు వీరే