కశ్మీర్ సరిహద్దులో పాక్ మరోసారి వక్రబుద్ధి ప్రదర్శించింది. పూంచ్ సెక్టర్లోని నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఓ భారత జవాన్ అమరుడయ్యాడు.
పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. సరిహద్దుల్లో దాడులకు పాల్పడిందని భారత రక్షణ శాఖ ప్రతినిధి కర్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. ఈ ఘటనలో ఉత్తరాఖండ్ సైనికుడు సుబేదార్ స్వతంత్ర సింగ్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.
ఇదీ చదవండి: కాలిపోతున్న భార్యను కాపాడకుండా వీడియో తీసిన భర్త!