ETV Bharat / bharat

కల్తీ మద్యం: 55కు చేరిన మృతుల సంఖ్య! - ఆలీగఢ్​లో మృతుల సంఖ్య

ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 55కు చేరినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు.. తాము ఇప్పటివరకు 51 మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించామని అలీగఢ్​ జిల్లా ప్రధాన వైద్యాధికారి తెలిపారు.

poisonous liquor
కల్తీ మద్యం
author img

By

Published : May 30, 2021, 1:19 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 55కు చేరినట్లు తెలుస్తోంది. మరో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారంతా జేఎన్​ వైద్య కళాశాల, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం ఈ మృతుల సంఖ్యను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఈ ఘటనలో 25 మందే మృతి చెందారని జిల్లా మేజిస్ట్రేట్​ చంద్ర భూషణ్​ సింగ్ శనివారం​ నిర్ధరించారు. అయితే.. అలీగఢ్​ ఎంపీ చెప్పిన మృతుల సంఖ్యకు, డీఎం చెప్పిన లెక్కలకు పొంతన లేదు. కల్తీ మద్యం తాగి మృతిచెందిన వారి సంఖ్యను అధికారులు దాస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం రాత్రి మరో 48 మృతదేహాలను పోస్టుమార్టం కోసం అధికారులు తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉన్నట్లు తెలుస్తోంది.

51 మందికి పోస్టుమార్టం..

మరోవైపు.. తాము ఇప్పటివరకు 51 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించామని జిల్లా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ బీపీఎస్​ కాలాయాని ఆదివారం తెలిపారు. ఇందులో 25 మంది కల్తీమద్యం కారణంగానే మృతి చెందినట్లు తేలిందని చెప్పారు. మరో 26 మృతదేహాల నుంచి నమూనాలు సేకరించామని..వాటిని పరీక్షల కోసం ఆగ్రాకు పంపించామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.

ఇదీ చూడండి: 22 ఏళ్లలో 16 వేల శవాలకు అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.