Snowfall in Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. భారీగా కురుస్తోన్న మంచు కారణంగా గలంధర్ పాంపోర్ వద్ద శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారి సమీపంలోని 1.32 లక్షల హైఓల్టేజీ టవర్ కుప్పకూలింది. దీంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. గంటల కొద్దీ వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి.
ఈ క్రమంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. టవర్ కూలడం వల్ల రావల్పిండి గ్రిడ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా రెండో లేన్ నుంచి విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు.
చిక్కుకుపోయిన టూరిస్టులు..
భారీగా మంచు కురుస్తుండటం వల్ల సోన్మార్గ్లో చిక్కుకుపోయిన 50మందికి పైగా యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
ఇదీ చూడండి: ఇళ్లు, కార్లను కప్పేసిన మంచు.. ఎటు చూసినా శ్వేతవర్ణ శోభితం