Snowfall in Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది. ఇళ్లు, దారులు సహా ఎక్కడ చూసిన మంచుతో కప్పి ఉన్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. భారీ హిమపాతంలోనూ తమ బాధ్యతలను నిర్వర్తించి శెభాష్ అనిపించుకున్నారు కొందరు ఆరోగ్య సిబ్బంది. ఓవైపు మంచు కురుస్తున్నా.. కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు.
ఇదీ జరిగింది..
సోమవారం నుంచి దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీ మొదలైంది. పిల్లల కోసం కులు జిల్లాలోని నగ్గర్ బ్లాక్లో ఉన్న స్థానిక పాఠశాలలో టీకా కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే, జిల్లాలో మంగళవారం భారీగా మంచు కురిసింది. మరో 48 గంటల పాటు ఇదే పరిస్థితులు కొనసాగుతాయని యెల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.
టీకా కేంద్రానికి వెళ్లాల్సిందేనని సంకల్పించుకున్న వైద్య సిబ్బంది.. మంచు వానలోనే అడ్డంకులను దాటుకుని గమ్యానికి చేరుకున్నారు. అర్హులైన వారికి టీకా అందించారు. సిబ్బంది నిబద్ధతపై ప్రశంసలు కురిపించారు ఉన్నతాధికారులు.
ఇదీ చూడండి: రోడ్డు లేక అవస్థలు.. మంచంపై గర్భిణీని మోసుకెళ్లిన గ్రామస్థులు