హైదరాబాద్ ఎంపీ(Hyderabad MP), ఏఐఎంఐఎం అధినేత(AIMIM Party Chief) అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై(Asaduddin Owaisi House) కొందరు దుండగులు దాడి చేశారు. దిల్లీ అశోకా రోడ్డులోని(Delhi Ashoka Road) ఆయన బంగ్లాపై దాడి చేసిన దుండగులు.. నేమ్ ప్లేట్లు, ట్యూబ్ లైట్లు మొదలైన వస్తువులను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు.
దాడి వ్యవహారంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి సమయంలో ఒవైసీ ఇంట్లో(Owaisi house) లేరని తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని.. నిందితులంతా ఈశాన్య దిల్లీలోని మండోలి ప్రాంతానికి చెందినవారని ధ్రువీకరించారు.
"మంగళవారం సాయంత్రం జరిగిన ఈ దాడితో ప్రమేయం ఉన్న ఐదుగురు హిందూసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాం. ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. అంతేగాక ఇతర వ్యక్తుల కోసం గాలిస్తున్నాం."
-దీపక్ యాదవ్, దిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్.
సుమారు 7-8 మంది ఇంటిపై దాడి చేశారని ఒవైసీ బంగ్లా నిర్వహకురాలు దీప తెలిపారు. 'కొందరు వ్యక్తులు నినాదాలు చేస్తూ బంగ్లా మీదకు ఇటుకలు విసిరారు. దీనితో కిటికీలు, లైట్లతో పాటు ఇంటి ప్రవేశ ద్వారం ధ్వంసమైంది' అని ఆమె వివరించారు.
స్పందించిన ఒవైసీ..
తన నివాసంపై జరిగిన దాడిపై ఒవైసీ స్పందించారు. ఒక ఎంపీ ఇంటిపైనే ఇలాంటి దాడులు జరిగితే ఎలా అని ధ్వజమెత్తిన ఆయన.. ఈ ఘటనకు పూర్తి బాధ్యత భాజపానే వహించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: