మనరోడ్లపై అత్యంత ఖరీదైన స్పోర్ట్స్కార్లు కన్పించడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. లాంబొర్గిని, ఆస్టన్ మార్టిన్ వంటి సంస్థలు భారత్‌లో డీలర్షిప్నూ ప్రారంభించాయి. ఈ సూపర్కార్లు రేస్‌లో పోటీపడిన వీడియోలు కూడా చాలానే చూశాం. వీటిని ట్యాక్సీలుగా ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఓ ఆడీ ఆర్8 ఓనర్ మాత్రం.. తన కారును స్విగ్గీ ఫుడ్ డెలివరీకి ఉపయోగిస్తున్నాడు. తానే స్వయంగా ఆర్డర్లు ఓకే చేసి వినియోగదారుల ఇళ్లకు.. ఈ ఖరీదైన కారులోనే వెళ్లి ఫుడ్ చేరవేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను తన వ్లాగ్‌లో పోస్ట్ చేశాడు.
తాను గతంలో హెచ్2 సూపర్‌బైక్‌పై ఫుడ్ డెలీవరీ చేసే వాడినని, అయితే ఆడి కారును ఇందుకు ఉపయోగించొచ్చు కదా అని అందరూ అడిగినందు వల్ల ఇలా చేస్తున్నట్లు ఓనర్ చెప్పాడు. తనతో పాటు స్విగ్గీ దుస్తులు ధరించిన మరో వ్యక్తి కారులో ఉంటాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తాను ఆడి కారు వాడటం మొదలుపెట్టిన గంట తర్వాత మొదటి ఆర్డర్ వచ్చిందని, అనంతరం నేరుగా బేకరీకి డ్రైవ్ చేస్కుంటూ వెళ్లినట్లు ఓనర్ చెప్పాడు. ఈ సారి కారు కావడం వల్ల బైక్‌తో పోల్చితే కాస్త అసౌకర్యంగా అన్పించినట్లు తెలిపాడు. బేకరీ నుంచి కస్టమర్ అడ్రస్‌కు వెళ్లినప్పుడు ఆ ప్రదేశమంతా ఇరుకుగా ఉందని, దీంతో కారును కాస్త దూరం ఆపి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని వివరించాడు. ఆ తర్వాత మరో ఆర్డర్‌ను ఓకే చేసిన కస్టమర్‌ను చేరుకున్నట్లు వీడియోలు పోస్టు చేశాడు. మొదటి రోజు రెండు ఆర్డర్లు పూర్తి చేసినట్లు వివరించాడు. ట్రాఫిక్ వల్ల కాస్త ఆలస్యమైనా.. కారులో డ్రైవింగ్ సౌకర్యవంతంగా ఉన్నట్లు ఓనర్ పేర్కొన్నాడు.
ఈ ఆడీ ఆర్8 కారు ప్రస్తుతం మార్కెట్లోకి రావడం లేదు. అయితే సెకండ్ హ్యాండ్ కారు మాత్రం లభిస్తోంది.