ETV Bharat / bharat

ఫ్రెండ్​తో ఫారెస్ట్​కు వెళ్లిన బాలికపై దాడి, వివస్త్రను చేసి వీడియో వైరల్​ - uttarpradesh 13 years boy died

స్నేహితుడితో కలిసి సిటీ ఫారెస్ట్​కు వెళ్లిన ఓ బాలికపై ఆరుగురు దుండగులు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను వివస్త్రను చేసి వీడియో తీసి వైరల్​ చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. అదే రాష్ట్రంలో జరిగిన మరో ఘటనలో నాలుగు నెలల క్రితం సామూహిక అత్యాచారానికి గురైన ఓ 12 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. అత్యాచారం చేసిన వ్యక్తులు ఆ విషయం తెలుసుకుని ఆమెను కిడ్నాప్​ చేసి అబార్షన్ చేయించారు.

Half a dozen youth assaulted a girl tore down her clothes in Hamirpur

author img

By

Published : Aug 19, 2022, 10:39 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని హమీర్​పుర్​లో దారుణం జరిగింది. స్నేహితుడి​తో కలిసి సిటీలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లిన ఓ బాలికపై ఆరుగురు యువకులు దాడి చేశారు. అనంతరం ఆమెను వివస్త్రను చేసి మొబైల్​లో వీడియో తీసి వైరల్​ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ జరిగింది.. హమీర్​పుర్​ నగరానికి చెందిన ఓ బాలిక తన స్నేహితుడితో కలిసి సిటీ ఫారెస్ట్​ ప్రాంతానికి వెళ్లింది. మొత్తం తిరిగాక ఓ చోట ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఆరుగురు యువకులు గుంపుగా వచ్చి వారిద్దరిపై దాడి చేశారు. ఆ తర్వాత బాలిక దుస్తులు చించేసి మొబైల్​లో వీడియో తీశారు. ఆ వీడియోను వారి స్నేహితులకు పంపి వైరల్​ చేశారు. అయితే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాల్ని పిలిచి విచారణ జరిపారు. ఆరుగురు యువకుల్లో పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్​ చేశారు.
"బాధితురాలితో పాటు ఆమె స్నేహితుడిపై నిందితులు దాడి చేశారు అనంతరం డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించారు. ఘటనపై విచారణ జరుపుతున్నాం. ముగ్గుర్ని అరెస్ట్​ చేశాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు" అని హమీర్​పుర్​ పోలీసులు తెలిపారు.

గ్యాంగ్​రేప్​ చేసి బలవంతంగా అబార్షన్​..
ఉత్తర్​ప్రదేశ్​లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. నాలుగు నెలల క్రితం సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాలిక గర్భం దాల్చింది. ఆ విషయం తెలుసుకున్న కామాంధులు చిన్నారిని కిడ్నాప్​ చేసి అబార్షన్​ చేయించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మహులి పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ గ్రామానికి చెందిన మనోజ్​, గోపాల్ అనే ఇద్దరు యువకులు.. అదే గ్రామానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలికపై 4 నెలల క్రితం సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాజాగా బాధితురాలు గర్భం దాల్చింది. ఆ విషయం తెలుసుకున్న నిందితులు.. బాలికను బుధవారం అర్ధరాత్రి కిడ్నాప్​ చేసి స్థానికంగా ఉన్న అర్హత లేని ఓ వైద్యుడి దగ్గర అబార్షన్​ చేయించారు. వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితులపై ఫిర్యాదు చేశారు. అయితే అత్యాచారం జరిగి నాలుగు నెలలు అవుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాలిక తండ్రి ఆరోపించారు.

అత్యాచారం చేశారంటూ ప్రిన్సిపాల్​పై ఫిర్యాదు..
కర్ణాటక.. ధార్వాడ్​ జిల్లాలోని ఓ ప్రైవేట్​ కాలేజీ ప్రిన్సిపాల్​తో పాటు ప్రెసిడెంట్​​పై ఇద్దరు విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు ప్రాంతాలకు తీసుకెళ్లి తమపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ విద్యార్థినులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ప్రిన్సిపాల్​, ప్రెసిడెంట్​పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రిన్సిపాల్​ మహదేవ కురవట్టిగౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. పరారీలో ఉన్న ప్రెసిడెంట్​ బసవరాజ్‌ యాదవన్నవర కోసం గాలిస్తున్నారు. బాధితురాళ్లను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించారు పోలీసులు.

విద్యార్థిపై టీచర్​ దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఉత్తర్​ప్రదేశ్​లోని సిర్సియా పోలీస్​స్టేషన్​ పరిధికి చెందిన ఓ 13 ఏళ్ల విద్యార్థి మరణించాడు. అయితే తన మేనల్లుడ్ని ఉపాధ్యాయుడు బలంగా కొట్టాడని బాలుడి మామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తీవ్రంగా కొట్టడం వల్లే బాలుడు అస్వస్థతకు గురయ్యాడని, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేపడుతున్నామని ఎస్​ఐ మౌర్య తెలిపారు.

ఇవీ చదవండి: జైల్లో ఖైదీ హత్య, 15 మందికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు

లేనివి ఉన్నట్లు చూపి రూ 150 కోట్ల స్కాం, విచారణకు ఆదేశించిన సర్కార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.