తమిళనాడు శివకాశీలోని బాణసంచా తయారీ యూనిట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి బాణసంచా తయారీలోని కూలీలు దూరంగా ఎగిరిపడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.