Six People Gang Rape Girl In Muzaffarpur Bihar : 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు వ్యక్తులు. 28 రోజుల పాటు బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ఆమె తల్లికి ఫోన్ చేసి కూతురిని తీసుకెళ్లాలని కోరారు. ఈ హృదయ విదారక ఘటన బిహార్ ముజఫర్‌పుర్‌లో జరిగింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..
సరౌయా పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 9వ తేదీన కొందరు వ్యక్తులు కారులో వచ్చి బాధితురాలిని కిడ్నాప్ చేశారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి ఆమెపై గత 28 రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్టు 5న బాలిక పరిస్థితి విషమించింది. వెంటనే నిందితులు.. బాధితురాలి తల్లికి ఫోన్ చేసి కుమార్తెను తీసుకెళ్లమని చెప్పారు. ఆమె వెంటనే తన కుటుంబ సభ్యులతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని.. అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను ఆస్పత్రికి తరలించింది. నిందితులపై సరౌయా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
"నా కుమార్తెను కొందరు కారులో వచ్చి జులై 9న కిడ్నాప్ చేశారు. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పోలీసులు నిందితులను పట్టుకుని ఉంటే నా కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగేది కాదు. కిడ్నాప్ జరిగి ఆగస్టు 5నాటికి 28 రోజులైన తర్వాత నిందితులు అపస్మారక స్థితిలో ఉన్న నా కూతురిని తీసుకెళ్లమని ఫోన్ చేశారు. నిందితులను పోలీసులు పట్టుకుని శిక్షించాలి. వారిని వదిలిపెట్టకూడదు.
--బాధితురాలి తల్లి
బాలికకు నిందితులతో సోషల్ మీడియా పరిచయం..
బాధితురాలికి.. నిందితులతో సోషల్ మీడియాలో పరిచయం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు చేశామని సరౌయా పోలీసులు తెలిపారు. మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశామని అన్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించామని వెల్లడించారు. నిందితులు ఎవరనే విషయం బాధితురాలు చెప్పిందని.. వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని తెలిపారు.
తల్లీకూతుళ్లపై 8మంది గ్యాంగ్ రేప్.. ప్రైవేట్ పార్ట్‌లపై కారం చల్లి..
విద్యార్థినిని కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్.. పెట్రోల్ పోసి నిప్పు.. 2నెలలుగా చికిత్స పొందుతూ..