ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి - రాజస్థాన్ జోధ్​పుర్ వార్తలు

రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-బొలెరో ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు.

Road accident in jodhpur, జోధ్​పుర్​ రోడ్డు ప్రమాదం
జోధ్​పుర్​ రోడ్డు ప్రమాదంలో 6 మంది మృతి
author img

By

Published : Jul 5, 2021, 8:47 AM IST

రాజస్థాన్​ జోధ్​పుర్​లోని డంగియావాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపుర్ హైవేపై ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-బొలెరో కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మణం చెందారు. అందులో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. ఆలస్యం కావడం వల్ల చికిత్స సమయంలో ఇద్దరు.. సోమవారం ఉదయం మరో వ్యక్తి మృతి చెందారు.

డంగియావాస్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని జైపుర్-జోధ్​పుర్​ రహదారిపై రాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బివార్కు వెళుతున్న బొలెరో.. ట్రక్కు మీదకు దూసుకెళ్లిందని డంగియావాస్​ పోలీసులు తెలిపారు. అంబులెన్స్​ రావడం ఆలస్యం అవడం వల్ల ప్రైవేటు వాహనాల్లో బాధితులను తరలించినట్లు పేర్కొన్నారు. దీంతో సకాలం వైద్యం అందించలేకపోయామన్నారు.

ఈ ప్రమాదంతోపాటు అదే మార్గంలో రోడ్డు నిర్మాణ పనుల జరగడం వల్ల ట్రాఫిక్​ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.