Road Accident: ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగోత్రి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల సమాచారం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు చంబా నుంచి ఉత్తరకాశీ వైపు బొలెరో వాహనం వెళ్తుంది. కోటిగడ్డ సమీపంలో వాహనం అదుపు తప్పి కాలువలో పడింది. వెంటనే వాహనం నుంచి మంటలు చెలరేగాయి. వాహనం కాలువలో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, వాహనంలో ప్రయాణికులు అప్పటికే పూర్తిగా కాలిపోయి చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: మహిళపై వలస కూలీల గ్యాంగ్ రేప్.. చంపి, కాల్చేసి..
పెళ్లికి ప్రియుడు నో.. ప్రేయసి సూసైడ్ అటెంప్ట్.. ఆరో అంతస్తు ఎక్కి..