మధ్యప్రదేశ్ బెతూల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తవా నది వంతెనపై ఇనుప రాడ్ల లోడ్‌తో వెళుతున్న ఓ లారీ అదుపు కింద తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఆరుగురు మరణించారు.
తొలుత వంతెన రెయిలింగ్స్‌ను ఢీకొట్టిన లారీ.. అలాగే పల్టీ కొట్టి నదిలో పడిపోయింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
లారీతో పాటు మృతులను వెలికితీసేందుకు క్రేన్‌తో సహాయక చర్యలు చేపడతున్నారు పోలీసులు. ఇందులో చనిపోయిన వారంతా పిపిరీ గ్రామానికి చెందినవారని తెలుస్తోంది.
ఇదీ చూడండి: ఘోర ప్రమాదం.. కారులో ఐదుగురు సజీవదహనం