ETV Bharat / bharat

TSPSC paper leak case: నోరు విప్పని నిందితులు.. రూట్ మార్చిన సిట్ అధికారులు - టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు అప్​డేట్

SIT Inquiry in TSPSC Paper Leakage Case : టీఎస్​పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు పలు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 19 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించారు. నిందితులెవరూ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇవ్వకపోవడంతో సిట్ అధికారులు ఇతరమార్గాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలు పరిశీలించడంతో పాటు నిందితుల సెల్‌ఫోన్లు పరిశీలిస్తున్న సిట్‌ .. అనుమానాస్పద లావాదేవీలతో పాటు ఫోన్‌నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

TSPSC
TSPSC
author img

By

Published : May 2, 2023, 7:17 AM IST

పేపర్ లీక్ కేసు.. ఫోన్​ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు

SIT Inquiry in TSPSC Paper Leakage Case : ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు సాంకేతికతను ఉపయోగించుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినా పెద్దగా వివరాలు చెప్పకపోవడంతో.. సిట్ అధికారులు తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు. నిందితులకు చెందిన బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్లు పూర్తిగా విశ్లేషించిన పోలీసులు వారి కుటుంబసభ్యులు, సన్నిహితుల బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తున్నారు. కాల్ డేటా అధారంగా నిందితులు ఎవరెవరితో మాట్లాడారు? ఎక్కడెక్కడ కలిశారు? అనే వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

TSPSC Paper Leak Case Update : ప్రధాన నిందితుడు ప్రవీణ్‌తో పాటు రాజశేఖర్ రెడ్డిని రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినా సిట్‌కి ఆశించిన మేర సమాచారం రాలేదు. ఏఈ ప్రశ్నపత్రం లీక్ చేసిన డాక్యానాయక్, రాజేశ్వర్‌లు.. అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేయడంతో పలుమార్గాల్లో సమాచారం సేకరించారు. 19 మందిని అరెస్ట్ చేసిన సిట్.. మొత్తం రూ.38 లక్షల వరకు లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. ఏఈ ప్రశ్నపత్రం దాదాపు 10 మందికి పైగా చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఏఈ పరీక్ష రాసిన ఏడుగురిని గుర్తించారు. మిగతా వారిని గుర్తించే పనిలో సిట్ అధికారులున్నారు.

ప్రధాన నిందుతుడి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ: బ్యాంకు లావాదేవీల ఆధారంగా సిట్ అధికారులు నలుగురు నిందితులను ఇటీవల గుర్తించారు. ప్రవీణ్ బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసిన ఖమ్మంకు చెందిన సాయి లౌకిక్, ఆయన భార్య సుష్మితలను అరెస్ట్ చేశారు. డీఏఓ ప్రశ్నపత్రం కోసం ప్రవీణ్ ఖాతాలో తన భార్య సుష్మిత సాయంతో సాయి లౌకిక్ నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. మహబూబ్‌నగర్‌కి చెందిన తండ్రి కుమారులు మైబయ్య, జనార్ధన్‌లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. డాక్యానాయక్ బ్యాంకు ఖాతా పరిశీలించడంతో జనార్ధన్ నగదు జమ చేసినట్లు తేలింది.

TSPSC పేపర్ లీక్.. సెల్​ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా గుర్తింపు: ఆయన కుమారుడు జనార్ధన్‌కి ఏఈ ప్రశ్నపత్రం కోసం మైబమ్య డాక్యానాయక్ ఖాతాలో రూ.2 లక్షలు జమ చేసినట్లు తేలింది. ప్రవీణ్, డాక్యా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినా.. అధికారులు ప్రశ్నించిన క్రమంలో ఇతర లావాదేవీల వల్ల డబ్బులు జమ అయినట్లు నిందితులు బుకాయించారు. కానీ ప్రశ్నపత్రం లీక్ జరిగిన సమయంలో ప్రవీణ్, సాయి లౌకిక్ ఖమ్మం, హైదరాబాద్‌లో కలిసినట్లు.. డాక్యా, మైబయ్య మహబూబ్‌నగర్‌తో పాటు వికారాబాద్​లో కలిసినట్లు సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా అధికారులు గుర్తించారు.

SIT Investigation in TSPSC Paper Leak Case: పక్కా ఆధారాలు ముందుంచడంతో నిందితులు అసలు నిజాన్ని ఒప్పుకున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలో అనుమానితులను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో విదేశాల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డికి ఇప్పటికే ఎల్​ఓసీ నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు భారత్‌కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.