ETV Bharat / bharat

సింఘు వద్ద ఉద్రిక్తత- పోలీస్ అధికారిపై దాడి - సింఘు సరిహద్దు ఉద్రిక్తత

సింఘు సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణల్లో అలీపుర్ స్టేషన్ హౌజ్​ అధికారిపై ఓ ఆందోళనాకారుడు కత్తితో దాడి చేశాడని దిల్లీ పోలీసులు తెలిపారు. నిందుతుడ్ని అరెస్ట్​ చేశామని.. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Singhu border clash: SHO grievously injured, says Delhi Police
సింఘు ఉద్రిక్తత- పోలీస్ అధికారిపై కత్తితో దాడి
author img

By

Published : Jan 29, 2021, 7:56 PM IST

సింఘు ప్రాంతం వద్ద శుక్రవారం జరిగిన ఆందోళనల్లో అలీపుర్​ స్టేషన్​ హౌజ్ అధికారి తీవ్రంగా గాయపడ్డారని దిల్లీ పోలీసులు తెలిపారు. అధికారి చేతికి తీవ్రంగా గాయమైందన్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితుడ్ని అరెస్ట్​ చేశామని ట్వీట్ చేశారు.

Singhu border clash: SHO grievously injured, says Delhi Police
పోలీస్​ అధికారిపై దాడి చేస్తున్న ఆందోళనాకారుడు

" రిపబ్లిక్​ డే రోజు జరిగిన హింసకు వ్యతిరేకంగా స్థానికులు చేస్తున్న ఆందోళనను రిజిస్టర్​ చేసేందుకు అలీపుర్​ స్టేషన్​ హౌజ్​ అధికారి అక్కడకు వెళ్లారు. ఈ ఘటనలో అతనిపై కత్తితో దాడి జరిగింది. అతని చేతికి గాయమైంది."

--దిల్లీ పోలీసులు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులు.. తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ఆందోళనకు దిగారు స్థానికులు. దీంతో సింఘు సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉందని, ఈ ఘటనకు పాల్పడ్డవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి : సింఘులో మళ్లీ ఉద్రిక్తత- పోలీసుల లాఠీఛార్జి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.